Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మత్సద్మని స్టీయతా మిత్యత్ర, అన్నపూర్ణాంబికాయా భక్తగృహనివాసోక్తి ర్నదోషాయ, కుతః, తస్యాభక్తపరాధీన త్వాత్, తథాచ, శ్రీసూక్లే, మమవసతుగృహే సర్వమాంగళ్యయుక్తే త్యుక్తత్వాచ్చ.”

ఇందింకనూ మఱికొన్ని శంకాసమాధానాలున్ననూ విస్తర భయముచే దిబ్మాత్రముగా నుదాహరించి విరమించుచున్నాను. ఇదేనా, మీ యిల్లు తాటాకులిల్లా? పెంకుటిల్లా? అంటే, బెడిదంగా రెండూ కాదు గడ్డింుల్లని మాత్రమే జవాబు చెప్పానంటే, చదువరులు నిజమైన జవాబేమి అని అనుకోక మానరని వ్రాయవలసి వచ్చింది. అప్పుడు యానాములో మేము కాపురమున్న యిల్లు గడ్డిల్లయిన మాటా సత్యమే. జాతకచర్యలో ఏవో కొన్ని పంక్తులలో టూకీగా వుదాహరించిన నా కాశీయాత్ర పూర్తిగా కాకున్ననూ కొంత విస్తరించి వ్రాస్తే ఇంత పెరిగింది. ఇంకా ఇందులో బుచ్చి మనుమరాళ్ల పెండ్లి వగయిరాలు వ్రాస్తే యెంత పెరిగేదో! కొంతమంది పండితుల నామములు మాత్రం ఇందుదాహరించినాను. ఇంకా యెందటినో వ్రాయవలసివున్నది. అందు మా గురుపరంపర మట్టుకు వ్రాసి విరమిస్తాను. కాశీనాథశాస్రులుగారు, వీరి శిష్యులు రాజారామశాస్రులుగారు, (వీరు శ్రీ భాగవతుల హరిశాస్రులవారికి సహాధ్యాయిలు) వీరి శిష్యులు మా గురువులు శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్రులుగారు. అస్మచ్చ్రీ గురుచరణారవిందాభ్యాం నమోనమః.


సమస్త సన్మంగళాని భవంతు