పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యోగాన్ని వుదాహరించి, యిక దీనిని ముగిస్తాను. జాతక చక్రములు జాతకచర్యా గ్రంథమున చూడగోరెదను.

కుసుమ యోగము

శ్లో లగ్నాత్సప్తమగే చంద్రే, చంద్రాదష్టమగే గురౌ,
   గురుణా సంయుతే లగ్నే యోగః కుసుమ సంజ్జితః !
   కుసుమాఖ్యేతు సంజాతో భూపాలో బంధురక్షక:
   వింశత్యబాత్పరం గ్రామపురకర్తా భవిష్యతి ||

ఇంత చక్కగా ఋజువిచ్చుచున్ననూ, ఇప్పటివారనేకులు జాతక విషయమున విశ్వాసము లేనివారుగానున్నారు.

అపసవ్య చక్రము

ప్రమోదూత సం|| శ్రావణశుద్ధ ద్వాదశి సోమవారం, (8-8-1970) రాత్రి 25-8 విగడియలవేళ, మిధునలగ్నమందు జననము.

లగ్నభుక్తి 3-45 శేషం 1-30 పూర్వాషాధా చతుర్థ చరణభుక్తిపోగా శేషము 14-21. ఋక్షాద్యంతము 57–50. పాదప్రమాణం 14-27 జననకాల శుక్ర మహాదశా శేషము సం 4-మా 11-రో 16.

జాతక పరిశీలకులకు ఈ చూపిన ఆధారములు చాలునుగాన విస్తరింపను.

ముమ్మిడివరంలో వితండవాదం మొదలుపెట్టిన పండితులకు నేను లిఖిత పూర్వకంగా యిచ్చిన సదుత్తరమును లిఖించి విరమిస్తాను.