పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(1889) సం|| వైశాఖ బహుళ త్రయోదశి మొదలుకొని, వికృతి (1890) ξόοι పుష్య బహుళ త్రయోదశి వఱకును అని తెలియగోరినాను. వివాహము జరిగినరోజు ఇదివఱలో వ్రాసియేయున్నాను. కాశీకి బయలుదేరినది పుష్యశుద్ధ తదియ యని జ్ఞాపకము. అటనుండి దేశానికి వచ్చినది ఆషాఢ మాసము. కోనసీమకు సంపాదనకు వెళ్లినది భాద్రపదమాసము. వివాహం నాటికి నా వయస్సు పందొమ్మిది సంవత్సరముల మూడు మాసముల యిరువదియొక్క రోజులు. కాశీ ప్రయాణం నాటికి ఇక నొక్కమాసం కలుపుకొంటే సరిపోతుంది. ఇంత డిటైలుగా యెందుకు వ్రాస్తున్నానంటే, నా జాతకమందు కొంత యితర పాపగ్రహ సంబంధం వున్నప్పటికీ శతమంజరీ యోగాల లోని "కుసుమయోగము" అనే మొట్టమొదటియోగము పూర్తిగా పట్టింది కూడా ఆ యోగము పట్టిన జాతకమునకు ఇరువదియేండ్లు దాటిన తర్వాత యోగమారంభ మవుతుందని దైవజ్ఞలు వ్రాశారు. దానికి తథ్యంగా, కాకినాడలో సంపూర్ణ శతావధానం చేసి పెద్దగా గౌరవము పొందినది ఖర (1891) సం|| ఆశ్వయుజ బహుళములో గనుక, అప్పటికి నా వయస్సు ఇరువదియొక్క సంవత్సరమూ రెండు మాసముల పై చిల్లర అగుటచే జాతకము చక్కగా దృష్టాంతం ఇచ్చినట్లే తజ్ఞలు అనుకోవచ్చును. ఈ కాకినాడ అవధానం నాటికి కుజమహాదశలో కుజాంతరం జరుగుతూవున్నది. యత్మించిద్యోగము కాశీ ప్రయాణానికి ముందే ఆరంభమయింది కనుక చంద్రునిలో శుక్రాంతరంలోనే యోగానికందిచ్చి నట్టున్నూ, దానిని కుజుడు ప్రబలం చేసినట్టున్నూ అనుకోవచ్చును. కుసుమ