ఈ కాశీయాత్ర మాత్రము జాతకచర్యలో లేనిదా అంటే, ఉన్నదే కాని, విస్తరింప వలసిన పుణ్యగాధ కనుక, నేనీమధ్య షష్టిపూర్తి జరిగినది మొదలుకొనిన్నీ అంతకు పూర్వం నుంచిన్నీ మిక్కిలి జబ్బుస్థితిలో వుండి, నిన్న నేటినుండి కొంచెం తేరుకుంటూ, ఈ రచన యిహపరసాధకమని చెప్పి దీనిని కొంత విస్తరించి వ్రాశాను. కాకినాడ, అమలాపురం వగయిరా అవధానములకున్నూ కాశీయాత్రకున్నూ సంబంధముండ నేరదు గనుక, వాటిని గూర్చి యిందు వ్రాయవలసింది లేదు. ఒక్కటి మాత్రం వ్రాసి తీరాలి. ముమ్మిడివరం కరణం, మాచిరాజు కామరాజుగారు మేము అమలాపురంలో గొప్ప గౌరవములు పొందుచూవున్న సమయంలో వచ్చి, వెనుక జరిగిన లోటు తీర్చుకొనే వుద్దేశ్యంతో వక పర్యాయం వారి గ్రామం రావాలని మిక్కిలి బలవంతంగా కోరారు. ఆయన యోగ్యతను బట్టి త్రికరణయా వెళ్లాలనే నేను అనుకొన్నాను గాని, యెందుచేతనో సాగిందికాదు. “బలీయసీ కేవల మీశ్వరాజ్ఞా."
ఏ గురువుగారి వద్ద చదువుకొంటూ, తీరికూర్చుని అయితే నేమి, నేను కాశీకి వెళ్లానో, మళ్లా ఆ గురువుగారి దగ్గఱకు వచ్చాను గనుక, ఇక దీన్ని ముగించుట యుక్తంగా వుంటుంది, యీ కాశీయాత్రన్నది నా జాతకరీత్యా, చంద్రమహా దశలో శుక్రాంతరంలో తటస్థించింది. వివాహం కూడా దానిలోనే. జాతక విషయం తెలిసిన వారికి, ఆయీ విశేషాలు ఏయే గ్రహస్థితులను ಬಜ್ಜಿ సంఘటించాయో తెలిసికొనే నిమిత్తం, నా జాతకం కూడా వుదాహరించి మటీ ముగిస్తాను. ఈ శుక్రాంతరం విరోధి