ని కివ్వలేవుట్రా? అని వీపుమీద చరిచినట్లయింది, నేను చేసే కార్యమేనా గంగా సంతర్పణగదా, అదిన్నీ దేవతా కార్యమే, ఇదీ దేవతాకార్యమే కనుక ఈ అవధానసభ నూటపదహారున్నూ ఆలయానికి అర్పణ చేశాను, ఇదుగో వసూలైన మట్టుకు సొమ్ము మీకు ఇస్తున్నాను, తక్కినది యావత్తూ శ్రద్ధగా వసూలు చేసి స్వామివారి గుడికి సమర్పించవలసింది" అని అధికారంతో ఆయనకు విధించి, ఆ వర్షంలోనే అయినాపురం గ్రామానికి ప్రయాణమై గుబ్బగొడుగు విప్పుతూవుండగా పాపము, ఆ కామరాజు గారు నేనెంత గంభీరంగా మనోవికారాన్ని తెలియనీయక పోయినా, లౌక్యుడు కనుక, అనుమానపడి, "ఈ పూటమట్టుకు మా యింట ఆగి వెళ్లండి, వరము, త్రోవలో చిక్కుపడతారు,” అని మిక్కిలిగా బ్రతిమాలినాడు. నేనూ వినయంగానే, “నాకు సెలవియ్యండి, సంతర్పణకు ఏర్పరచుకొన్న రోజు దగ్గఱకు వస్తూ వున్నది" అని మాట్లాడుతూ ప్రయాణం చేశాను.
ప్రొద్దు గ్రుంకేటప్పటికి అయినాపురం ప్రవేశించాను. ఎవరో గృహస్టులింట దర్భాసనం దింపాను. వచ్చిన సంగతి చెప్పాను. ఆ గృహస్టు, ఇక్కడ ప్రస్తుతం వున్న డెల్టా సూపరింటెండెంటు గారు బహు యోగ్యులు, పండితులంటే ప్రాణమిస్తారు, అని చెప్పి, వారిబసకు వెంటబెట్టుకొని తీసుకువెళ్లేరు. నన్ను ఆయన మిక్కిలి గౌరవించి భోజనాలయిన తరువాత ఆ రాత్రే అష్టావధాన సభ జరిగించి గౌరవించాడు. మరునాడు సాయంకాలంలోగా యేభై అరవై చాపులు, రమారమి నూరు రూపా