పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లున్నను, అప్పటికి ఎవరేని యాచకులు వెళ్లేయెడల, ఆ రెడ్డి సీమలో ෂටර්‍ම පුංෂී డబ్బు సంపాదన కావడము నిస్సంశయము. అప్పటికి బ్రాహ్మణులంటే, అందులో చదువుకొన్నవారంటే, పట్నాల్లోనేమి పల్లెటూళ్లలోనేమి, గృహస్థులు మిక్కిలిగా ప్రేమించేవారు. ఎప్పుడోకాని బ్రాహ్మణుడు కనుపడని రెడ్డిసీమను గూర్చి చెప్పేదేమిటి ఆ సీమలో "లక్కవరం" అనే గ్రామం పెద్దది. ఆ వూల్లో కోమట్లు విస్తరించి వున్నారు. కోమట్లున్నచోట సర్వసాధారణంగా ధనలక్ష్మికూడా వుంటుందని చెప్పనక్కరలేదుగదా, ధనమున్నచోట, సర్వత్రా కాకున్ననూ, నూట నాటనైనా దాన ముండకపోదు. మేము ఈ సంగతి మనస్సులో పెట్టుకొని ఆ వూరు వెడితిమి. ఆయూరి వర్తకులు మమ్మల్ని ఆదరించి మాచేత పురాణము చెప్పించి, విని మాప్రయత్నానికి యథాశక్తిని తోడ్పడినారు. తరువాత, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మొదలైన వూళ్లు కూడా వెళ్లి ప్రయత్నించినాము. కామవరపుకోటలో పెద్దకోమటి యిచ్చిన చీటీ పుచ్చుకొని ప్రతిదుకాణం గోరుముష్టి కూడా యెత్తేము. కాని లక్కవరంలోవలె యొక్కువగా లాభించిలేదు. అంతలో గణేశ్వర చతుర్థి సమీపించినది. గురువుగారి సన్నిధికి వచ్చి సంపాదించిన - స్వల్ప ద్రవ్యమును వారికి నివేదించితిమి. వారు "చలినీళ్లకు వేడినీళ్లు తోడు” అన్నట్లు మటికొంత ద్రవ్యమును జేర్చి ఆ వుత్సవమును సర్వోత్తమంగా జరిగించిరి. ఆ తొమ్మిదిరోజుల్లో విద్యార్థులకు పాఠములుండవుకాని, శాస్త్రములో పూర్వపక్షములు కొందఱు చేస్తే మటి కొందఱు సిద్ధానములు' చేయడం మొదలైన వ్యాసంగ