పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలవాడు. ఆయన నాచేత అష్టావధానం సభ చేయించి నూటపదహార్లు ఇచ్చే వూహతో నున్నాడు. ఈలోగా ఆయన పినతండ్రి అమ్మిరాజుగారున్నూ, వెంపరాల వెంకట శాస్రులు గారున్నూ నన్ను పరీక్ష చేయడానికి అప్పుడప్పుడు ఏవో వారికి తోచిన శంకలు శంకిస్తూ వుండేవాడు. నా స్థితి అప్పటికప్పుడే ఆలాటి సామాన్య పండితులకు లొంగేటట్టు లేదు. కౌముది ప్రధానభాగాలు అయినాయి, పరిభాషేందు చాలమట్టుకు అయింది." ఇతర వ్యాఖ్యానాల్లో విశేషాలు కొన్ని తెలుసును. ఈ స్థితిలో వున్న నేను కేవల సాహిత్యం మాత్రం వున్నవారికేలా లొంగుతాను? అదిన్నీ కాక వారిరువురున్నూ విద్యావయోవృద్దులే అయినను నన్ను అడిగే ప్రశ్నలు శుద్ధ అవ్యక్తముగా నున్నాయి.


మాదిరికి వక్కటి వుదాహరిస్తాను, దానివల్ల వారి పెద్దతనమున్నూ నా చిన్నతనమున్నూ మీకే తెలుస్తుంది. నేను అన్నపూర్ణాష్టకంలో అమ్మవారిని మత్సద్మని స్థీయతామ్, అని కోరినాను, దానికర్థ మింతకు పూర్వం వ్రాసే వున్నాను. ఈ స్థలంలో వారి శంక "అబ్బాయీ, అమ్మవారిని మీయింటిలో నుండమన్నావు కదా? అయితే మీ యిల్లు తాటాకులయిల్లా? లేక పెంకుటిల్లా” అని. నా సమాధాన మేమిటంటే, మాయిల్లు మీరన్న రెండు విధములలో నొక్కటియుగాదు, గడ్డియిల్లు, అని. పాండిత్యంతో పాటు నాకు పెంకెతనమున్నూ లోటులేదు. కనుక పెడసరంగా జవాబిచ్చాను. పైగా వయస్సుముదిరిన వారి ధోరణి యెంత పెడత్రోవ నున్నదో చదువరులు పరికింతురుగాక. దానిమీద