పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సును? ఆ రోడ్లే సరియైన దనుకొన్నాము. అది ఒక పల్లెటూరి దగ్గిరకు తీసుకువెళ్లింది. ఆపైని రోడ్డు లేదు. అప్పుడు వాణ్ణి లేపేము. లేచి చూచాడు. వీటి తల్లి సిగదరగా, తోవదప్పించాయన్నాడు. ఇప్పుడేం చేదామన్నాము. ఈ వూల్లో ఆగుదామన్నాడు. ఇక్కడ అన్నం దొరుకుతుందా అన్నాను. బ్రాహ్మలు లేరన్నాడు. వున్నవూరు తీసుకు వెళ్లమన్నాను. మంచిదని యేదో పొలాలత్రోవను వొక చిన్న అగ్రహారంలోకి తీస్కు వెళ్లేడు. ఆ వూళ్ళో గోడలకు బదులు ముళ్లకంచెలే విస్తారం కనపడ్డాయి. వీధులు తెలియడమే లేదు. జామురాత్రికి లోపుగా అయింది. నాకు ఆకలి అపారంగా వేస్తూ వుంది. కొన్ని యిళ్లకి వెళ్లి అడిగేను కాని, భోజనాలయిపోయినా యన్నారు. ఒక యిల్లాలు మాత్రం, నాయనా! అన్నముందికాని, యిప్పుడే చల్లి కుండలో పడేశానన్నది. 'అమ్మా! అది అయితే మరీ మంచిదన్నాను. అలా అయితే రండి నాయనా అని వడ్డించింది. తృప్తిగా ఇద్దరమూ భోంచేసినాము. జ్వరపడియున్న నాకు రాత్రివేళ ఆ భోజనం విధిగా జబ్బు చేయవలసిందే కాని, ఆ చేతి మాహాత్మ్యమేమో లేశమున్నూ జబ్బు చేయనేలేదు. ఆ రాత్రి ఆ యిల్లాలు అన్నము పెట్టకపోతే నేను యేమగుదునో యిప్పుడు వ్రాయజాలను.

యోగ్యుల వూహలు కూడా వకప్పుడు లోకాపకారకాలు

ఈ రీతిగా కొన్ని వూళ్లలో భుక్తల గృహాల్లోనూ (తూర్పు దేశంలో అగ్రహారీకులను భుక్తలంటారు) కొన్ని వూళ్ళల్లో సత్రాలలోనూ భోంచేస్తూ, కొంత నడకమీదా కొంత బండిమీదా