గణపతి నవరాత్రములు
నేను ఆయా గురువరుల సమక్షమున అక్షరములు, బడి చదువు, ఫ్రెంచి, సంగీతము, భారవి వఱకు కావ్యములున్నూ చదువు కొని, కొంచెము లఘకౌముది చదివి - బ్రl| శ్రీ|| చర్ల బ్రహ్మయ్యశాస్తులవారి సన్నిధికి విద్యాభ్యాసమునకు వెళ్లేటప్పటికి నాకు పద్దెనిమిదో వత్సరము దాటవచ్చింది. శ్రీ శాస్రులవారి వద్ద సిద్ధాంత కౌమది ప్రారంభించిన మాసం దాటునంతలో - గణపతి నవరాత్రములు సమీపించినవి. అపుడు గురువుగారు శిష్యులనుద్దేశించి, “ఈ గణపతిపూజ విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. కాశీలో దీనిని మిక్కిలి శ్రద్ధాభక్తులతో విద్యార్థులు చేస్తూ వుంటారు, కాబట్టి మీరు కూడా చేస్తే మీకు సకల శ్రేయస్సులున్నూ కలుగుతవి” అని ప్రస్తావించి నారు. అప్పటికి శ్రీ శాస్రులు గారు కాశీనుండి వచ్చి కొలదికాలమే అగుటచే విద్యారులు నలుగురైదుగురికంటే లేరు, అందులో నేనొకడను. శాస్త్రములో నాకంటె తక్కిన విద్యార్థులు ఎక్కువవారే కాని, సంస్కృతము మాటెటులున్ననూ, తెలుగులో కవిత్వము చెప్పటయందేమి, పురాణము చెప్పటయందేమి, నేను "అల్లుల్లో మల్లు పెద్ద" అన్నట్లున్నాను. గణపత్యుత్సవాలకు కొంత ధనార్జన కావాలి గనక, నన్ను శాస్తుల వారు ఆ విద్యార్థులలో పెద్దచేసి సంపాదనార్ధం పంపించినారు.
శాస్త్రులవారి గ్రామము తాడేపల్లిగూడెమునకు ఉత్తరంగా సుమారు రెండు క్రోసుల దూరములో నున్న కడియెద్ద అనే పల్లెటూరు. ఈ యూరికి రెడ్డిసీమ కడు దగ్గఱ. ఇప్పుడెటు