యి. కీకటానికి తూర్పుప్రక్కను మహానది వున్నది. అది జీవనది. గోదావరి, కృష్ణ వీట్లవంటిదే. వెడల్పులో ఇది ఆ మహానదికి తీసిపోదుగాని, జీవనది మాత్రం కాదు. పడమటి దిక్కున ఇది వున్నది. ఈలాటివి, ఇంతింత కాకున్నను ఇంతకంటె చాలాచిన్నవి అయిన సెలయేళ్లు త్రోవలో ఎన్నో తగులుతవి. బొత్తిగా చిన్నవియైతే రోడ్డుబాటకు అడ్డం తగులకుండా ఏదో తూము కట్టివున్నారు. కాని ఈ బాపతులు అప్పటికింకా కట్టబడివుండలేదు. ఇవి అప్పుడప్పుడు చాలా ప్రయాణీకులకు మోసం కల్పించడ మున్నూ కలదు. ఆ రోజున ప్రమాదం మాత్రమేమీ జరుగలేదు కాని, మాబండీ మేమూ ఆవలికి దాటేటప్పటికి రాత్రి యెనిమిది గంటలు దాటింది అప్పుడు మాకు బసయెక్కడ, బండలెక్కడ?
“ఊరు నాకు క్రొత్త, ఊరికినే క్రొత్త." ఒక వోడ్ర పండితుడు ఆవలి వొడ్డునకు దిగిన సమయంలో తటస్థించాడు. ఆయనకు సంస్కృతం వచ్చును. పాపమాయనే మమ్ము "శాస్త్రిణః కుత ఆగచ్ఛంతి? కుతోవాగచ్ఛంతి?" అంటూ ప్రశ్నించాడు. తత్కాలోచితమైన జవాబును చెప్పి నేటి రాత్రి మా గతి యేమి అని అడిగితిని. ఆయన తనతో తీస్కునివెళ్లి వంట వగయిరాలకు సదుపాయం కల్పించి ఆదరించాడు.
తెల్లవారుజామున మళ్లా బయలుదేరి వకటిరెండు మకాములు వెళ్లేటప్పటికి బండియెదొకటి పడుక్కోవడం మొదలు పెట్టింది. అప్పుడు మటౌక బండెక్కడ దొరుకుతుంది? ఆ యొద్దుకు