ఆదరంగా వారు మన దేశస్టులకు అన్నోదకాలిచ్చి ఆదరిస్తారు. వారం రోజులు బాబాకరంగా వారింటిలోనుండి కాశీ వదలింది మొదలు అన్నంలేని లోపాన్ని పోగొట్టుకొన్నాము. నాతో ఉండడంచేత కోమటికి కూడా వారు ఆతిథ్యం ఇచ్చారు. తరువాత త్రోవలోకి ఇంత గోంగూరపచ్చడి వగయిరాలు కూడా ఇచ్చాయి. నా అనారోగ్యం కూడా కొంత తగ్గింది. పిమ్మట కటకాన్నుంచి యొడ్లబండి చేసికొని బయలుదేరాము. కాకులు కూసేటప్పటికి వూరి వెలుపలికి వస్తిమి. అక్కడ ఒక ఇసుకమయమైన నదివున్నది. సుమారు మూడు ఫర్లాంగులమేర బండ్లేమి, మనుష్యులేమి దానిలో నడచి వెళ్లవలసిందే. వందలకొలదిగా బళ్లు వెళుతూవున్నాయి. ఏచంటి పిల్లలో తప్ప, සටයීෂ්ඨ మనుష్యులు దిగి నడుస్తూ వున్నారు. ఈలాటి సందర్భంలో కొంచెము నీరు నురుగలతో ప్రవహించడాని కారంభమయింది. మధ్య త్రోవలో వున్న బళ్లు యెట్లో ఆవలివొడ్డుకు చేరాయి, అంతకన్న వెనుకవున్నవి తిరిగీ వెనక్కి వచ్చేశాయి. వక పావుగంటలో మోకాలిలోతు నీరు ప్రవహించడం మొదలుపెట్టింది. అరగంటయ్యేటప్పటికి ఇంకచెప్పేదేమిటి? త్రివిక్రమావతారంలాగు "ఇంతింతై వటుడింతయై" అన్నట్లు పొంగి మిన్ను ముట్టుచూ పాము మీసం తెగగొట్టుచూ తన్నే చూడమని ఆ నది పరాక్రమించింది. మాబండీ మేమూ వడ్డునే వున్నాము, సూర్యోదయం అయింది. దంతధావనాది కాలకృత్యాలు నెఱవేర్చుకున్నాము. అంతలో ఎక్కడ నుండివచ్చాయో రెండు పెద్ద బల్లకట్లు వచ్చాయి. ఆవలిబండ్లను ఈవలికి, ఈవలి బండ్లను ఆవలికి దాటించడానికి మొదలుపెట్టాయి. ఎక్కడ తెములుతుంది, వకటా? రెండా? వందలకొలది బండ్లున్నా
పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/57
Appearance