పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుతాయి. ఎట్లాగయితేనేమి రాత్రి సుమారు పన్నెండులోపున అన్నం వండాను. పెసరపప్పు వండాను. అరటిపళ్లు కొనుక్కున్నాము. మజ్జిగ మాత్రం మంచిదే దొరికింది. "కాలే కడుపునకు మండే బూడిదె, అన్నట్లు పొట్ట నిండించుకొన్నాము. గయ వదలి నాటికి సుమారు పదిరోజులు దాటింది. ఈలోపున మాకు ఏ రొట్టో తప్ప అన్నం లేదు. ఆ హేతువుచేత ఆ వుప్పుడు బియ్యం అన్నం అమృతోపమానంగా వుంది. క్షుధాతురాణాం న రుచిర్న పక్వం' అక్కడే అంతా పరున్నాం.


తెల్లవారింది. ముందు ప్రయాణం ఎప్పడంటే ఎప్పుడని కనుకోగా, పగలు రెండు గంటలకు స్టీమరు వెనుక కట్టిన కంకర పడవలవంటి పడవల మీద యొక్కడ మున్నూ, మరునాడు వుదయానికి కటకం చేరడమున్నూ అని వాకబుమీద తెలిసింది. మళ్లా పెందలకడ వంట మొదలెట్టి పదిగంటలలోగా వకమాటు తిని, ప్రయాణం అయేటప్పుడు రెండోమాటుకూడా తిన్నాం. దృష్టి దోషంగాని మటొకదోషంగాని అక్కడ భోజనంలో లేశమున్నూ මීක්‍ෂ. ෂ యిల్లు బహుశః ఆ దేశంలో కోమటివర్ణము నకు చెందినదై యుండునేమో. ఆ దేశాన్నే కీకటమని శాస్త్రజ్ఞలు వ్యవహరిస్తారు. "దితిజాధిప కీకటంబు దేవాపగయున్" అని దేవీభాగవతము. ఈ దేశాల్లో తీర్థయాత్రకు తప్ప ఇతర కారణంమీద ప్రయాణం చేసేయెడల ద్విజులు తిరిగీ వుపనయనం చేసికో వలసినదని ధర్మశాస్త్రములు తెల్పుతున్నవి. "తీర్థయత్రాం వినా గచ్ఛేత్పువస్సంస్కార మర్ధతి" తిరిగీ వుపనయనం చేసికొంటే పవిత్రు