Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలకత్తా ఆతిథ్యం

ప్రసక్తానుప్రసక్తంగా కథ. యొక్కడికో పోతూవున్నది. ఈలాంటి మహాపండితు లందఱూ కాశీలో తయారై వచ్చి మన దేశాన్ని అలంకరించేవారన్నది ప్రధానాంశము. అట్టి కాశీ యిపుడు ఏదో మాదిరి స్థితిలో నున్నట్టు వింటాము, ఆ కాశీనుండి నేను దేశానికి రాబోవుచూ, సహాయం కోసము చూస్తూవుండగా మన దేశస్టుడే రెడ్డిసీమలోని లక్కవరము నుండి వచ్చిన వందనపు నర్సయ్య ෂබී కోమటిబిడ్డ నావలెనే సహాయం కోసము వెతుక్కుంటూ నాకు దొరికినాడు. నేనతనికి దొరికాను, ఇరువురము తల్లిదండ్రులు కలవాళ్లమే కావున మాకు గయకు వెళ్లవలసిన ప్రసక్తి లేశమున్నూ లేకపోయినప్పటికీ, పోనీ రాకరాక వస్తిమిగదా, విష్ణు పాద సందర్శనం చేసికొని పోదామని గయకు కూడా వెళ్లాము. అక్కడ విష్ణుపాదమును పూజించుకొని కలకత్తాకు టిక్కట్టు పుచ్చుకొన్నాము. 144వ నెంబరుగల గృహములో మన తెలుగు దేశీయు లున్నారు. అక్కడికి తీసుకువెళ్లమంటే జట్కావాడే తీసుకువెడతాడు, అని కాశీలో ವಿದ್ಯ್ಗೆಲು చెప్పినారు. అది జ్ఞాపకం పెట్టుకొన్నాముగాని, ఆ జట్కావాడు మమ్మలిని మోసం జేసి యొక్కడో వాడికి తోచినచోట దింపి బాడుగ తేతెమ్మన్నాడు. వాడితో పోట్లాడలేక వాడిదివాడికిచ్చి ఆ సమీపంలో వున్న ధర్మశాలలో దిగినాము. అది సకల అల్లరిచిల్లరి జనంతో ఎంతో సంకులంగా వున్నది. అయితే యేం చేయము? ఆ మహాపట్టణములో మమ్మల్ని చూచేదెవరు? అది ఆషాఢమాసము, తొలకరివానల కారంభమయింది. విరుద్ధమైనగాలి, వంటకు మొదలుపెడితే, పొయ్యి