పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ్చుటకు ఆ కాలములో ప్రజలొప్పుకోరుగదా. ఆ కారణముచే అందులోకూడా నేను వేషం వేసి నటించే దుర్యోగమో సుయోగమో నాకు తప్పిపోయింది. కానీ యివి అన్నీ యేదో కొంచెం సంగీతాన్ని తెలుగులో కొంత భాషా జ్ఞానాన్ని కలిగించాయని మాత్రం చదువరులు తెలియగోరుతారు. నాకు తెలుగునకు ఇంతకన్న గురుశుశ్రూష లేశమున్నూ లేదు. నేను గురుశుశ్రూష చేసి అభ్యసించినది సంస్కృతము మాత్రమే. అందులో వ్యాకరణం మాత్రమే కొంత కష్టపడి శ్రద్ధచేసి చదివితిని. ఆ చదువుటయైనా శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్రులవారి యొద్దనే, దేశంలోనే. కాశీలో వూరకే మొదలుపెట్టి యే కొంచెమో చదివినా, అది లెక్కలోది కాదు. మళ్లా దేశానికి వచ్చి దేశంలో మొదటి గురువుగారి వద్దనే తక్కిన గ్రంథాలు తిరుపతిశాస్త్రిని సహాధ్యాయిగా చేసికొని చదువుకొన్నాను.

బ్రాహ్మణార్థపు ధనసంపాదన

కాశీనుంచి దేశానికి వచ్చే సందర్భం యిక వ్రాస్తాను. మా తల్లిదండ్రులకు నా కాశీగమన వృత్తాంతం తెలిసింది. వారు మా గురువు గారి వద్దకు వెళ్లి యెట్లో రప్పించకపోతే తాము కూడా కాశీకి వెడతామని గట్టిగా పట్టుపట్టారు. దానిమీద గురువుగారు నాపేర వృత్తరం వ్రాశారు. వినయంగా తమ సెలవు ప్రకారం బయలుదేరి వస్తున్నానని జవాబు వ్రాశాను. కాని కాశీనుండి బయలుదేరడముకు కాళ్లు రావు. రేపూ, ఎల్లుండీ, ఇట్లా అనుకుంటూ కాలం జరుపుతూ, అక్కడి వుత్సవాలు బుడ్వామంగళ్ లోనైనవి చూస్తూకాల