పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలంలో, దేవుడు గుళ్ళోసేవ లయేటప్పుడు, మా తండ్రిగారితో గుల్లోకి వెళ్లి, అక్కడ పాడే సేవమోభాపాటలు వినడం వకటిన్నీ తోలుబొమ్మలు దీక్షగా చిన్నప్పుడు చూడడం వకటిన్నీ నా బాల్యంలో తఱచుగా యానాములో శ్రీ మన్యం మహాలక్ష్మమ్మ జమిందారు “గారి మేడయెదుట జరిగే వీధి నాటకాలు, రామనాటకం, ప్రహ్లాద నాటకం, తదేకదృష్టితో చూడడం వకటిన్నీ నేను శ్రీ కానుకుర్తి భుజంగరావు పంతులు" వారి వద్ద రఘవంశం చదువుకొనేటప్పుడు శ్రీ తోట్లవల్లూరి సంస్థానము నుండి వచ్చిన వక వైష్ణవుడు నృసింహాచార్యులు" అనే గాలి సంగీతపాటకుడు నాకు సహాధ్యాయిగా తటస్థించుట వకటిన్నీ నే నంతోయింతో కూనిరాగం తీయగల్గుటకు హేతువులు. అంతేకాని నేను సంగీత శాస్త్రజ్ఞడను కాను అన్నది యిట సారాంశము.

వేషధారణ ప్రయత్నం

ఆ వైష్ణవుని సహవాసమువల్లనే నాకు ఈ కూనిరాగపు సంగీతంతోపాటు ముక్కుపొడుము పీల్చుట కూడా అభ్యాసం అయినది. ఇంకా వ్రాస్తే ఆ వయస్సులో వ్రాయవలసినవి చాలా కలవు. వకటి రెండు టూకీగా వ్రాసి మళ్లా కాశీలోకి వస్తాను. ఆ ఆచార్యులు మంచి సౌందర్యవంతుడు; స్త్రీ వేషమునకు బాగా వుంటాడు. అందుచేత ఆయన చిత్రాంగి, నేను సారంగధరుడను, నీలపల్లె స్కూలులో నేను బడిచదువు చదువుకొనేటప్పుడు నా క్లాసులోనే చదివిన యొక వేశ్యబాలిక రత్నాంగి, ఈ రీతిగా పాత్రలు ఏర్పాటుచేసి యొక చాత్తాని వైష్ణవుడు నాటకం అంతా