పన్నెండున్నరకు అన్నపూర్ణ సత్రం, (దీనినే శ్రీమంతుడు" పెట్టించినట్లు చెపుతారు. ఇది మేము నివసించే నారదఘట్టానకు మిక్కిలి దగ్గఱ. ఇందులో చాలామంది సన్యాసులకు భిక్ష జరుగుతుంది.) రెండు గంటల ప్రాంతంలో సింధ్యాసత్రం." ప్రతి సత్రంలోనున్నూ కానో అర్ధణో దక్షిణ, భార్యాసహితంగా చదివికొనే విద్యార్థులకు కూడా ఆయా సత్రాల్లో అన్నం పెడతారు. ఒకటి మాత్రమున్నది. మగవాడు ప్రత్యేకించి వెడితే అన్నం పెడతారుగాని, ఆడది అట్లా వెడితే పెట్టరు. మగవానితో కూడ వెడితే ప్రశ్నించరు. భార్యాభర్తలనే అనుకుంటారన్నమాట, తండ్రీకూతుళ్లు, అన్నాచెల్లెళ్లు, వెడితే అన్నం పెడతారో లేదో నాకు అప్పటికి తెలియదు. కాని, ఆలోచిస్తే, వాళ్లకు కూడా ఆక్షేపణ వుండదనే తోస్తుంది. వితంతువులకు మాత్రము పెట్టరని యెఱుగుదును. ఇంకొకటి; లింగధారి బ్రాహ్మణులకు బొత్తిగా సత్రాల్లో అన్నం పెట్టరు. కారణం, ఉర్లాం జమీందారు బసవరాజుగారు" కాశీ వెళ్లినపుడేదో పండితులను సమ్మానించడంలో అనుచితం జరిగిందనిన్నీ దానిమీద పండితులు ఆ జమీందారుగారి సమ్మానమును నిషేధించి, వారితోనే కాదు, ఆ జాతివారితో భోజన ప్రతిభోజనాలు వర్జితం చేసి, సత్రాల్లో తగిన కట్టుదిట్టం చేశారనిన్నీ మా గురువుగారి వల్లనే మన దేశంలోనే విన్నాను. అందుకు తథ్యంగా, నాతో వచ్చిన కృష్ణశాస్త్రిగారి యింటిపేరు కందుకూరు అనే కారణం వల్ల కొంత చిక్కుకూడా వచ్చింది. కాని అది తుట్టతుదకు బ్రహ్మిష్ణోబ్రహ్మం మీద అనేక పెద్దల సాక్ష్యంమీద వారించుకోడం తటస్థించింది, ఈ చిక్కుతెచ్చిపెట్టినవారు శ్రీ దండిభొట్ల విశ్వనాథశాస్రులుగారు." వీరు మన
పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/30
Appearance