Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆఱణాల మూడుడబ్బులతో ప్రయాణం

వివాహం జరిగిన తర్వాత, పదహారు రోజుల పండుగ ముగియకుండగానే, మరల గురువుగారి సాన్నిధ్యమునకు వెళ్లి చదువుతూ వుండగా, గురువుగారితో జల్లిసీమ' ప్రయాణం తగిలింది. ఆ ప్రయాణంలో తిరుపతిశాస్త్రిగారి గ్రామం యెండగండి మకాంలో గురువుగారు వుండగా గురువుగారి తల్లి శత వృద్ధురాలు స్వర్గస్టురాలైనది. ఆ కారణంచే గురువుగారు స్వగ్రామం దయచేసినారు. వెళ్లునప్పుడు శిష్యులతో, అంతకుముందు పాఠశాల నిమిత్తం ఆ చుట్టుపట్ల గ్రామస్టులు చందాగా నిచ్చిన ధాన్యమును ఏకత్రకు చేర్చి కడియెద్దకు చేర్చే యేర్పాటు చేయవలసినదిగా చెప్పినారు. ఆ వసూలు చేయుటలో నాకున్నూ ఒకవూరు వంతు వచ్చింది. ఆ వూరిపేరు ಹಿಂದಿುಲ್ಟು. నేనున్నూ, నాకు కొలది దినముల క్రిందటనే సహాధ్యాయిగా నేర్పడిన కందుకూరి కృష్ణశాస్త్రి గారున్నూ ఉందుఱు వెళ్లవలసివచ్చింది. “నీకు తిరుపతి శాస్త్రి సహాధ్యాయి గదా! కృష్ణశాస్త్రిగా రెవరని చదువరులడుగవచ్చును. వినండి, నేను గురువుగారి దగ్గఱ ప్రవేశించునప్పటికే తిరుపతిశాస్త్రి ప్రవేశించి చదువుచూ వున్నాడు. అందుచే ఒకటి రెండు మాసముల గ్రంథం అతనికి కౌముదిలో ఎక్కువ అయింది. ఆ కారణంచే ఇప్పటికింకను తిరుపతి వేంకటేశ్వరులకు సతీర్ధ్య భావమే కాని, సహాధ్యాయిత్వము లేదని తెలియగోరెదను. కృష్ణశాస్త్రి గారున్నూ నేనున్నూ ఉందులు వెళ్ళక పూర్వమే స్నానానికి వెళ్లి కాలువ వొడ్డున ఇట్లు ఆలోచించు కొన్నాము. ఏమని యంటే : "శాస్రులుగారు కొన్నాళ్ల వఱకున్నూ మనకు పాఠములు చెప్ప