నుండి లేచేవేళకు మా తలిదండ్రులు వచ్చి కలిసికొన్నారు. వారికప్పుడు, ఏకపుత్ర విషయంలో మనకిది ప్రాప్తిలేకపోయిందికదా అని కొంత విచారమున్నూ, తలవనితలంపుగా బీదలమగు మన కుబ్జవాడికి పెండ్లి జరుగుచున్నదిగదాయని కొంత సంతోషమున్నూ కలిగింది. ఆయీ సందర్భములను నానారాజ సందర్శనములో" - సీ|| పరదేశములు దివ్యతర దేశములు గాంగ|| అను సీసములో సూచించియున్నాను.
ప్రయాణ ముహూర్తమే పెండ్లి ముహూర్తం
ఇక నొకసంగతి జ్యోతిష శాస్త్రజ్ఞలు ఇచట గమనింప వలసియున్నది. నేను త్రికరణశుద్ధిగా కాశీకి వెళ్లవలెనని ముహూర్తము పెట్టుకొంటిని. ఆ ముహూర్తము పెండ్లి ముహూర్తముగా మాఱుటచే, నా యుద్దేశమునకు వ్యతిరేకమేయైననూ స్నాతకములో కాశీయాత్ర అనుపేర నేవో కొన్ని యడుగులు నడచుట కొంత ఆచారమై యుండుటచే, అనుకొన్న వుద్దేశముకూడ నెఱవేటినట్లు సంతసింపవచ్చును. మటియూ నీవివాహ సందర్భములో అప్పుడు జమీందార్లుగానున్న శ్రీ బుచ్చితమ్మయ్య, చిన్నరావు గార్లమీద నాచే కొన్ని పద్యములు చెప్పి వినిపింపబడ్డవి. అందొకటి మాత్రమిచ్చట ఉదాహరిస్తాను.
ఉ. అంచితులౌ భవజ్జనకు లాదర మొప్పగం గాశిలోన జె
ప్పించిన సర్వశాస్త్రములఁబెంపుగనధ్యయనం బొనర్చి రా
ణించెడు చర్ల వంశవరనీరధిశారదచంద్రు సార్థతో
దంచిత బ్రహ్మయాభిధబుధాగ్రణిశిష్యుండ వేంకటాఖ్యుడన్