పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తేజోమూర్తుల అన్నపూర్ణమ్మగారు

ఇక నొకటి ఇక్కడ వ్రాయక తీరదు. మా గురువుగారు కాశీలో నున్న కాలంలో ఈ కిర్లంపూడినుండి తేజోమూర్తుల అన్నపూర్ణమ్మ అనే ఆవిడ తీర్థయాత్రకు వెళ్లింది. కాశీకాక ఇంకా ఉత్తరదేశ యాత్రలు చేయునప్పుడు మా గురువుగారు కూడా కాకతాళీయంగా ఆమె వెళ్లునప్పుడే యాత్రార్థం దయచేసినారు. ఆ పరిచయంవల్ల, దేశానికి వచ్చిన పిమ్మట, ఈ కిర్లంపూడి వచ్చినపుడు జమీందారుల ద్రవ్యముతో దినబత్తెం జరుపవలసియున్ననూ, అన్నపూర్ణమ్మగారి ద్రవ్యమునే గురువుగారు సవిద్యార్థికంగా వుపయోగించేవారు. జమీందార్లు కూడా యిందుకు సమ్మతించేవారు. ఆ అన్నపూర్ణమ్మగారు శాస్రులవా రెన్నినాళ్లున్నను బహు భక్తిశ్రద్ధలతో స్వయంగా వండి మాకందఱకీ షడ్రసోపేతంగా నిత్యసంతర్పణ జరిగించేది. నా వివాహము వీరి యింటనే నిశ్చయమయింది. నిశ్చయించేటప్పుడే ఈమె, స్నాతకము' మాత్రము మా యింటనే నా ఖర్చుమీదనే జరుగవలెను, అని కోరినది. “అట్లే" అని గురువుగారంగీకరించారు. స్నాతకం చ్చే క్రాని అన్నపూర్ణమ్మగారి గృహమునుండియే పెండ్లికి తరలివెడితిమి. స్నాతక సమయానకు మాత్రము మా తలిదండ్రులు రాలేదు. కారణం, అపుడు వర్షాధిక్యముచే ఏలేళ్లు పొంగి మార్గాలు అరికట్టినాయి. చుట్టుమార్గం ద్వారా వచ్చేటప్పటికి ఇక్కడ స్నాతకము వేశ్రాక్ర పుణ్యదంపతులు కూర్చుని జరిగించినారు. ఆ దంపతులు అన్నపూర్ణమ్మ శాఖవారే, కాసలేయులు' ఆయన పేరు బుల్లినారాయణ సోమయాజులు. స్నాతకపు పీటలమీద