పుట:Kashi-Majili-Kathalu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

కాదంబరి


బరిదేవియొక్క తాంబూలకరండ వాహినియగు తమాలికను వరించి పరిహాసమను చిలుక విరహవేదనచెందుచున్నదని లోకమున జనులు చిత్రముగాఁ జెప్పుకొనుచున్నారు. ఈవృత్తాంతము కర్ణపరంపరచే రాజకులమంతయు వ్యాపించియున్నది. సిగ్గుమాలిన యీతమాలిక మూలమున పతత్రము కళత్రమును విడుచుట వామాచారమై యున్నది అది యట్లుండనిండు. చపల యగు నీదుష్టదాసినిఁ గాదంబరి యేమిటికి మందలింపదు? అగు నీశారిక నీచిలుకకుఁ బెండ్లిజేయునప్పు డెన్నియో బుద్ధులు గఱపియేయుండు నని నిలిచియున్నవియా? స్త్రీలకు సాపత్నీపరిభవంబు ప్రథానకోపకారణంబు పెద్దవివాదహేతువుగదా? ఇట్టి పరాభవములయందుఁ దఱుచు స్త్రీలు విషయమైనందిందురు అగ్గి నైనంబడుదురు. ఈశారిక గట్టిదియే అట్టిపని యేదియుం జేయలేదు. ఇప్పుడు మనమీ చిలుకచే నీతప్పు గావుమని దీనిం బ్రతిమాలింపఁ జేయుదము. అప్పుడు ప్రసన్నురాలై భత౯ను మన్నించుగాక. అట్లు మన్నింపదేని యీశారికదే తప్పుగా గణించి దీని విడిచివేయుదము. పరాభవము జేసి విడిచిన దీని నెవ్వరాలాపింతురు? యెవ్వరు మన్నింతురు? ఎవ్వరు పోషింతురు? ఇదియే దీనికిఁ బ్రాయచిత్తమని పలికిన విని కాదంబరీ పరిచారక లెల్లఁ దత్ర్కీడాలాపము గ్రహించి నవ్వుకొనిరి.

అప్పుడాచిలుక యతని నర్మాలాపము లాలించి యిట్లు పలికినది. దూత౯! రాజపుత్రా! యీశారిక రాజకుల సంపర్కము వలనఁ జతురమతియైయున్నది. నీవుగాని, యితరులుగాని దీనిని భయపెట్టజాలరు. ఇవి పరిహాసజల్పిదము లని తెలిసికొనఁగలదు. ఈవక్రోక్తులు దీనిముందరఁ బనికిరావు. కోపప్రసాదములయొక్క కాల కారణ ప్రమాణవిషయంబులఁ బాగుగా నెఱుంగును. శృంగారభాషితముల కిది నెలవని పలుకుచున్న సమయంబునఁ గంచుకి యరుదెంచి