పుట:Kashi-Majili-Kathalu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి కథ

85


మదీయజీవితము నీహస్తమందుండఁగలదని స్థాపించుచున్నట్లు కాదంబరి యతనిచేఁ దాంబూలమిడినది. పిమ్మట భుజలతానుసారముగాఁ గరకిసలయమును లాగికొనుచు ననంగశరభిన్నమధ్యమగు హృదయమువోలెఁ జేతనుండి జారిపడిన రత్నవలయమునుఁ దెలిసికొనఁ జూఁడదయ్యెను.

మఱియొకతాంబూలము మహాశ్వేత కిచ్చి యచ్చేడియ పచ్చ విల్తుని రాయింబడియున్న సమయంబున నొకశారిక వారికడ కరుదెంచి తన్నుఁ దరిమికొనివచ్చిన చిలుకం జూపుచుఁ గాదంబరి కిట్లనియె.

భర్తృదారికా! కాదంబరీ! నన్ను బాధింపుచున్న యతి దుర్వినీతుఁ డగు నీపతంగాధము నేమిటికి వారింపవు? వీనిచేఁ బరిభవింపఁబడుచున్న నన్నిఁక నుపేక్షించితివేని నీపాదములార తప్పక ప్రాణముల విడిచెదను జుమీ! అని పలికినంతఁ గాదంబరి యించుక నవ్వినది.

అప్పుడు మహాశ్వేత విస్మయముతో నీశౌరిక యేమనుచున్నదని మదలేఖనడిగిన నప్పడఁతి యిట్లనియె. దేవీ! యీశారికను గాళిందియను పేరుపెట్టి మారాజపుత్రికయే పెంచుచుఁ బరిహాసమును పేరుగల యీచిలుకకు స్వయముగాఁ బెండ్లిజేసి భార్యాభర్తలగాఁ బిలుచుచున్నది. నేఁటి ప్రాతఃకాలమునఁ గాదంబరీ తాంబూల కరందవాహిని యగు నీ తమాలికతో నేకాంతముగా నేదియో మాటాడుచుండ నాచిలుకం జూచినదఁట. అప్పటినుండియు నీర్ష్యారోష కషాయితమతియై యీశారిక యీచిలుకంజూడదు. మాటాడదు, చేరనీయదు. మేమెంత బ్రతిమాలినను బ్రసన్నురాలు కాకున్న దిదియే దీనివృత్తాంత మని చెప్పిన విని మందహాసము గావించుచుఁ జంద్రాపీడుఁ డిట్లనియె.

అగు నగు నీవాతన్ నిదివఱకే మేము వినియుంటిమి. కాదం