పుట:Kashi-Majili-Kathalu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుండరీకుని కథ

75


గీతాది కళాపరిచయము మాకొక్కచోటనే కలిగినది. ఆరీతి మాయిరువురచేతను బాలభావము గడుపఁబడినది.

ఆకాంత యిప్పుడు నావృత్తాంతమును విని మిక్కిలి శోకించుచుఁ దానుగూడ నిట్లు శపథముచేసినది. నావయస్యయైన మహాశ్వేత దుఃఖించియుండగా నేను బెండ్లియాడను. మాతండ్రినాకు బలవంతముగా బెండ్లిచేసినచో రజ్జు, సర్ప, విష, సావకాదుల మృతినొందు దాన నని సఖులచెంత పల్కుపలుకులు కర్ణాకర్ణికగా విని దానితండ్రి చిత్రరథుఁడు మిక్కిలి పరితపించుచు నేకాపత్యుఁడగుటచే నేమియు దానిని మందలింపలేక వితర్కించి మఱియొకయుపాయ మేమియుం గానక నాయొద్దకు క్షీరోదుఁడను కంచుకి నంపి వత్సా! మహాశ్వేత, నీ నెచ్చెలి కాదంబరి సంపూర్ణయౌవన యయ్యు వివాహమాడనని మూర్ఖముచేయుచున్నది. యెవ్వరు చెప్పినను వినకున్నది. నీకన్న దానిచిత్తమును మరల్పువారు లేరు. ఎట్లైన నీవీ కష్టమును మాకుఁ దొలగింపు మని నాకు వార్తనంపెను. నేనావార్తవిని గురువచనమందలి గౌరవముచేతను సఖురాలియందలి మక్కువచేతను అయ్యో కాదంబరీ! దుఃఖించుచున్న నన్ను మిక్కిలి దుఃకింపజేయుచున్నా వేమి? నాకు సంతోషము గలుగజేయు తాత్పర్యము నీకుఁ గలిగియున్నచో నామాట విని తండ్రిచెప్పిన చొప్పున నడువుము. ఇదియే నాకుఁ బ్రియము.

అని నామాటగా చెప్పుమని తరళికను క్షీరోదునివెంట నీదినముననే యంపితిని. అదివెళ్ళిన కొంచెముసేపునకే దేవర దయచేసితిరని పలికి యూరకుండెను.

అంతలోఁ జంద్రోదయమైనది. అప్పుడు మహాశ్వేత వల్కల తల్పంబునం బరుండి నిద్రబోయినది. చంద్రాపీడుఁడును మనంబున అయ్యో యిప్పుడు వైశంపాయనుఁ డేమిచేయుచుండునో నన్నుఁ