పుట:Kashi-Majili-Kathalu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9]

పుండరీకుని కథ

65

యవల్లభుని సంతోషపెట్టెదనని పలుకుచు మూర్ఛాఖేద వివశములగు నవయవములచే నెట్టకేలకుఁ దరళికం బట్టుకొని బయలుదేరితిని.

అట్టి సమయంబున నాకుఁ గుడికన్నదరినది. అయ్యో దైవ మిదియేమి యిట్టి సూచన గావింపుచున్నాడు. మరియు నేమిచేయఁదలఁకొనెనో కదా యని శంకించుకొనుచుఁ బరిజనమునకు సైతము తెలియకుండ దాంబూలాంగరాగాది సుగంధ ద్రవ్యములు గైకొని తరళిక వెంటరా నాపారిజాత మంజరియే ధరియించి యామేడ వెడలి నీలపటావకుంఠనముతో రహస్యమాగ౯మున నయ్యచ్చోద సరస్సమీప వనమునకుఁ వచ్చుచుంటిమి.

ఆహా? అడుగు గదిపినఁ బెక్కండ్రు పరిచారికలు వెంటనడచి వచ్చుచుండు నేనట్లు తరళికా సహాయినినై పోవుచుండ నించుకయు వెరవులేక పోయినది. ప్రియునింగూర్చి యేకాంతముగా బయలు వెడలువారికి నారోపితశరాసనుండై పుష్పబాణుండు సహాయముగా వచ్చుచుఁ బరిచర క్రియల నుపదేశింపు చుండునుగదా.

లజ్జను వెనుకకుఁద్రోసి నాకంటె ముందుగా నింద్రియములతోఁ గూడ హృదయము పరుగిడఁ దొడంగినది. అప్పుడు నేను తరళికం జూచి సకియా! యీ యిందుహతకుఁడు నన్నుఁబలె బుండరీకుని సైతము గరంబులంగట్టి యభిముఖముగాదీసికొని రాఁడుగదా! యని పలికిన నదియు నవ్వుచు, రాజపుత్రీ? నీవు ముద్దరాలవు సుమీ? ఇతని కతనితోఁబ్రయోజనమేమి? మదనాతురుండువోలెనీయందట్టి చేష్టలం గావింపుచున్నవాఁడు చూడుము. ప్రతిబింబకైతవంబున స్వేదకణికాంచితమగు నీకపోలముఁ జూపించుచున్నవాఁడు. లావణ్యభూయిష్టమగు కుచభారంబునం బడుచుండెను. కాంచీరత్నముల గరంబుల నంటుచుండె, నిదిగో నఖలగ్న మూతి౯యై చరణంబులం బడుచున్న వాఁడు, మఱియుం దాపంబున నతని మేను శుష్కచంద లేపపాండు