పుట:Kashi-Majili-Kathalu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

కాదంబరి

మును లెక్కింపక సదాచార మతిక్రమించి తండ్రి యనుమతి వడయక యచ్చటికిఁబోయి యప్పుండరీకునిం గలసికొంటినేని గురుజనాతిక్రమణదోషంబున నధర్మము రాగలధు.

ధర్మోపరోధభయంబున నేను బోకుంటినేని తప్పక మృత్యువునే యంగీకరింతును. దానంజేసి క్రొత్తగా స్నేహముగలసిన కపింజలు తోడఁ బ్రణయరసభంగముకాగలదు. అదియునుంగాక నాయందాసయుంచుకొనిన పుండరీకుఁడుసైతము ప్రాణ పరిత్యాగముచేయును. దాన మునిజనవధమహాపాతకము రాఁగలదు. ఈఱెంటిలోఁ నేది యుత్తమమో నిరూపింపుమని పలుకుచుండఁగనే చంద్రోదయమైనది.

రతికలహ కుపిత రోహిణీచరణాలక్త కరనలాంఛితుండు వోలె నుదయకాలంబున నెఱ్ఱఁబడిన చంద్రునిఁజూచి విహ్వలనై తరళికోత్సంగంబున శిరంబడి తదీయకిరణజాలంబులు చల్లనివైనను దాహజ్వరఖిన్నునిపై నిప్పులవష౯ము గురిసినట్లు సంతాపము గలుగఁజేయ మూర్ఛపోతిని.

అప్పుడు తరళిక నన్నుఁ బలుమారు పిలిచి పలుకకుండుట గ్రహించి తొట్రువడుచు శైత్యోపచారము లెన్నియేని గావించినది. అప్పుడు నాకించుక తెలివివచ్చి కన్నులందెరచితిని.

చందనపంకార్ద్రంబులగు కరంబులు జోడింపుచుఁ దరళిక నన్నుఁజూచి, దేవీ! నీవిక సిగ్గుపడిన లాభములేదు. ధర్మమునకు వెరచితివేని ప్రమాదము రాకమానదు. నీసంతాపమంతకన్న నెక్కుడగు చున్నది. నాయందు దయయుంచి పుండరీకుఁడున్న చోటికిఁ పోవుదము లేమ్ము. తదీయబాహునాళములఁ బెనవైచినప్పుడుకాని నీ మేనికాక తగ్గదని వినయముగాఁ బలుకుచున్న తరళికంజూచి ఓసీ! మదనుని మాట జెప్పనేల? ఇప్పుడీ శశాంకుఁడే ప్రాణములను హరింపుచున్నవాఁడు. అట్లే పోవుదములెమ్ము. అతి ప్రయత్నముతోఁ బోయి హృద