పుట:Kashi-Majili-Kathalu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుండరీకుని కథ

63

తలంచితిని. పాపము, మన్మధుఁడు నన్నుఁబలెనే యాతనింగూడఁ బరితాపము నొందజేయుచు నాకు మంచియుపకృతి గావింపుచున్నవాఁడు. అతం డట్టి యవస్థ ననుభవింపుచున్నాఁడను మాట నిక్కువము. స్వప్నమందైనను గపింజలుఁడు అసత్య మాడువాఁడుకాడు. ఊరికింత దూరమువచ్చి యేల ప్రయాసము జెందును. ఇప్పుడీతనికి నేనేమని చెప్పుదును? ఏమికావింపఁదగినది? యుపాయమెద్ది? యని యనేక ప్రకారములఁ దలంచుచున్న సమయంబునఁ బ్రతీహారి వచ్చి రాజపుత్రీ! నీవస్వస్థతగా నుంటివనుమాట విని నిన్నుఁ జూచుటకై మీ యమ్మగారు వచ్చు చున్నారని చెప్పెను.

ఆమాట విని కపింజలుడు మహాజనసమ్మర్దభయంబున నట నుండవెరచి లేచి, రాజపుత్రీ! సూర్యుండస్తమించుచున్న వాఁడు. నేనుఁ బోయివచ్చెద; మిత్రప్రాణముల రక్షించుటకై యిదిగో యంజలి ఘటింపుచున్నవాఁడ. కర్తవ్యమెద్దియో యోచించి యట్లు కావింపుమనిపలుకుచుఁ బ్రత్యుత్తరమును బొందకయే బయలుదేరి పెక్కండ్ర పరిచారికలతో నామెతల్లి వచ్చుచున్నది కావున నాసమ్మర్దములోఁ దప్పించుకొని యెట్లో దాటిపోయెను.

మజ్జననియు నాపజ్జకువచ్చి కొంతసేపు నినసించి తిరిగివెళ్ళి పోయినది. ఆమె నాయెద్దకువచ్చి యేమిచేసినదో యేమిపలికినదో శూన్యహృదయ నైన నేనేమియు నెఱుంగను.

అంతలో సాయంకాలమగుటయు నప్పుడు కర్తవ్యమెద్దియో తెలియక తరళికతో నిట్లంటిని. తరళికా! నాహృదయ మాకులమయినదనియు నింద్రియములు వికలములయినవనియు నీవెఱుంగవా యేమి? ఇప్పుడేమి చేయఁదగినదో నాకుఁదెలియకున్నది. కపింజలుఁడు చెప్పినమాటలన్నియు నీవు వింటివికదా! చక్కగా నాలోచించి నాకుపదేశింపుము. నేనితరకన్యలవలె సిగ్గును విడిచి జనాపవాద