పుట:Kashi-Majili-Kathalu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

కాదంబరి

మాలిక నడుగుటకు వచ్చియున్నానని చెప్పుచున్నాడు. అనుజ్ఞ యే మని యడుగగా నేను మునికుమారనామ గ్రహణముచే మిగులఁ దొందరపడుచు నతనిరాక శంకించుకొనుచు వేగమ తీసికొనిరమ్మని యాజ్ఞాపించితిని.

అమ్మునికుమారుని వయస్యుఁడయిన కపింజలుని నది వోయి తీసికొనివచ్చినది. అతనియాకారముఁజూడ విషాదముతోఁ గూడినట్లు కనఁబడినది. అప్పుడు నేను దటాలున లేచి నమస్కరించి యాదరముతో స్వయముగాఁ బీఠముదెచ్చివైచితిని. పీఠోపవిష్టుండయిన యతని యడుగులను వలదనుచుండ బలాత్కారముగాఁ గడిగి యుత్తరీయాంశుకుముచేఁ దడియొత్తి యతనికిఁ దాపుగాఁ గూర్చుంటిని.

అతం డట్లొక ముహూర్తమాత్రము విశ్రమించి యెద్దియో చెప్పఁదలచుకొని నాదాపుననున్న తరళికపై దృష్టి నెరయించెను. దాన నతని యభిప్రాయము గ్రహించి దేవా! యిది నాశరీరము వంటిది. వక్తవ్యాంశము నిస్సంశయముగాఁ జెప్పవచ్చునని పలుకగాఁ గపింజలుఁ డిట్లనియె.

రాజపుత్రీ! నేనేమని చెప్పుదును? సిగ్గుచేత నావాక్కు వక్తవ్యాంశమును గ్రహింపకున్నది. కందమూలములం దినుచు శాంతముగా నడవులఁ గ్రుమ్మరు మునిజనమేడ? మన్మధవిలాసములేడ? అంతయు విపరీతముగానే యున్నది. దైవమెట్లుచేయుటకు సంకల్పించెనో చూడుము. భగవంతుఁ డప్రయత్నముచేతనే పురుషునిఁ బరిహాస్పదునిగాఁ జేయునుకదా! ఇది యేధర్మోపదేశమో నాకుఁ దెలియకున్నది. నాసందేశము చెప్పక తప్పదు. మఱియొకయుపాయ మేదియు గనంబడకున్నది. కొండొకప్రతిక్రియయుఁదోచదు. ప్రాణ పరిత్యాగముచేతనయినను మిత్రుని రక్షింపఁదగినదని చెప్పుచున్నాను వినుము. నీదాపుననే నిష్ఠురముగా నిట్లు కోపపడి యట నుండక