పుట:Kashi-Majili-Kathalu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8]

పుండరీకుని కథ

57

దెచ్చితి నిదిగో చూడుమని తాంబూలభాజనమునుండి యాపత్రికం దీసి నాకందిచ్చినది.

నేనును దత్సంభాషణములచేతనే మేన రోమోద్గమము జనింప నతనిముట్టినట్లు సంతసించుచు నాపత్రిక నందుకొని తల్లిఖితాక్షరంబులం జూచి కన్నుల నద్దికొనుచు మదనావేశముతో నిట్లు పఠించితిని.

ఉ|| తామరతూడువోలె విశ ♦ దంబగు ముత్తెపుపేరుచేత నా
      హా! మహిలోభ పెట్టబడు ♦ హంసవింధబున నాశఁజెంద నెం
      తో మదుదారమానస స ♦ ముద్భవభూరితరాభిలాష నీ
      చే మహిళావతంసమ? రు ♦ చింగొనిపోఁబడెజూవెఁదవ్వుగాన్||

అట్టి పద్యముజదివించినంత నాలుకగోసిన మూగవానివలెఁ గలుద్రావిన యున్మత్తునిపగిది స్మరాతురమగు నాహృదయము ప్రవాహముచేత వ్యాకులమయిన సరిత్తువలె విహ్వలత్వము గైకొనినది.

మఱియు, నాపత్రికంజూచుటచేఁ ద్రిలోకరాజ్యవైభవ మనుభవించినట్లు సంతసించుచు దానిఁ గపోలములయందును అలకలయందును బెట్టుకొనుచుఁ దరళికా! చెప్పుము, చెప్పుము. అతండు నీచే నెట్లు చూడబడియెను? ఏమేమి చెప్పెను? నీయొద్ద నెంతసేపు నివసించెను? అని పలుమారు దానినడుగుచు నెట్ట కేలకు నాదివసముగడిపితిని.

పిమ్మట నాహృదయముతోఁ గూడ సూర్యబింబము కృతరాగ సంవిభాగముగలదియై యొప్పినది. అప్పుడు ఛత్రగ్రాహిణివచ్చి రాజపుత్రీ! అమ్మునికుమారులలో నొకఁడు వచ్చి ద్వారముననిలిచి జప

_________________________________________________________________________

శ్లో|| దూరంముక్తాలతయా బిససితయాప్రలోభ్యమావోమె
      హంసఇవదర్శితాశో మానసజన్మా త్వయానీతః||

తా! ముత్తెపుపేరును చూచి తామరతూడనుకొని యాసతో దూరముగాఁబోయిన హంసవలెనే నీచేత నామనోరథము దవ్వుగా దీసికొని పోయితివని తాత్పర్యము.