పుట:Kashi-Majili-Kathalu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుండరీకుని కథ

55


నయినను వెండియు స్నానముచేయుటకుఁ దటాకమునకుఁ బోయితిని.

అందుఁ గ్రుంకి తల్లితోఁగూడ మెరైకకుఁబోవు ప్రవాహము వలె నతిప్రయత్నముతో నింటికివెళ్ళి కన్యాంతఃపురము ప్రవేశించి యతనిన్వరించుచు నది మొదలు విరహవిధురనై యిట్లు తలంచితిని.?

అయ్యో! నేనచ్చటనే యుండక యింటి కేమిటికి వచ్చితిని? ఆ! రాలేదు. నేనచ్చటనే యుంటి. కాదు యిది గృహమే? ఇప్పుడు నేను నిద్రబోవుచున్నానేమో! స్వప్నములో నిట్లు కనంబడినది కాబోలు. అయ్యో! నాకన్నులు తెరవఁబడియే యున్నవి. స్వప్న మెట్లు వచ్చును? ఇది రాత్రియా? పగలా? నాకీతాపమురోగమేమో? నేనిప్పుడెచ్చట నుంటిని? యెచ్చటికిఁ బోవుదును? ఎవ్వరితోఁ జెప్పుకొందును? దీనికిఁ బ్రతీకారమెద్ది? అని పెక్కు తెరంగుల నున్మత్తవలెఁ బలవరించుచు నంతఃపురమున కితరుల రాకుండ నియమించి యొంటిగా నొకగవాక్షముదాపునఁ గూర్చుండి ఆదిక్కునే మిక్కుటమయిన దానిగాఁ దలంచుచు నాదిశనుండి గాలి వచ్చినను మనోహరమయినదానిగాఁ నెంచుచు మౌనమవలంబించి యాతనిరూపమును లావణ్యమును, యౌవనమును మాటిమాటికి స్మరించుకొనుచు మేనం బులకలు బొడమఁ దత్కరతలస్పర్శసుఖం బభినయించుకొనుచు క్షణ మొక యుగములాగున గడుపుచుంటిని.

అంతలో నాతాంబూలకరండ వాహిని తరళిక యనునది నా యొద్దకువచ్చి నాయవస్థ యంతయుం జూచి చింతించుచు నిట్లనియె.

రాజపుత్రీ! అత్తటాకమునుండి స్నానము జేసి నీవు నన్నుఁ బరామర్శింపక ముందుగా నింటికి వచ్చితివికదా! నీవు వచ్చిన తరువాత నొకవిశేషము జరిగినది. యాకర్ణింపుము. దివ్యాకారములతో నిరువురు మునికుమారులు అచ్ఛోదసరస్తీరంబున మనకుఁ గనంబడిరి కదా! వారితో నీకీపుష్పమంజరి నిచ్చినయతండు ఱెండవవానికిఁ