పుట:Kashi-Majili-Kathalu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

కాదంబరి

పిమ్మట రెండవమునికుమారుఁడు ఆప్రకారము ధైర్యస్థలితుఁడైన యప్పుండరీకుం జూచి యించుక యలుక మొగంబునఁ దోపనిట్లనియె.

మిత్రుడా! పుండరీక! క్షుద్రజనులచేఁ ద్రొక్కంబడినయీ మార్గమునీకుఁ దగినది కాదు. సాధులు ధైర్యధనులుకదా ప్రాకృతుండువోలె వివశంబగు చిత్తము నరికట్టవేమి? ఇప్పుడు నీకపూర్వమైన యింద్రియచాంచల్యము గలిగినదే? ధైర్యము, వశీత్వము, ప్రశాంతి బ్రహ్మచర్యనియమము, ఇంద్రియ పరాఙ్ముఖత, యౌవనశాసనత్వము మొదలగు నీసుగుణము లన్నియు నెందుబోయినవి? నీచదువంతయు నీటఁగలిపితివే, నీవివేకమంతయు నిరధ౯కమైనదే, అయ్యయ్యో కరతలమునుండి జారిపడిన జపమాలికను సైతము గురుతెఱుఁగకుంటివి? యేమి నీమోహము? ఒకవేళ బ్రమాదముచే బుద్ధి చాంచల్యమంది నను వివేకముతో మరల్చుకొనరాదా? యున్మత్తునిక్రియ వతి౯ంచుచుంటివేయని పలికిన విని యించుక సిగ్గు జెందుచునతనితోఁ బుండరీకుం డిట్లనియె.

వయస్యా! కపింజల! నన్ను మఱియొకలాగునఁ దలంపకుము. నే నట్టివాఁడను కాను. దుర్వినీతయగు నీనాతి నాజపమాలికను గ్రహించిన యపరాధమును నేను మరచిపోయితి ననుకొంటివా? చూడుమని యళీకకోపముదెచ్చుకొని యతిప్రయత్నముతో భ్రూభంగము గావింపుచుఁ జుంజనాభిలాషఁ బోలెఁ బెదవిగఱచుచు నాకడకు వచ్చి యిట్లనియె.

చపలురాలా! నాజపమాలిక నాకియ్యక యిందుండి యెందు వోయెదవు? ఇచ్చి కదులుమని పలుకగా విని నేనును నా మెడనుండి యేకయష్టిగల ముత్తెపుపేరును దీసి, ఆర్యా! ఇదిగో! మీమాలికను స్వీకరింపుఁ డని పలుకుచు మన్ముఖమునందు దృష్టినిడి శూన్య హృదయుఁడై చూచినయతని చేతియందమ్మాలనిడి స్వేదసలిలస్నాత