పుట:Kashi-Majili-Kathalu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

కాదంబరి

పుండరీకుని కథ

దేవలోకంబున శ్వేతకేతుఁడను మహాముని కలఁడు. అతని యాకారము త్రిభువనసుందరమైనది. అమ్మహాముని యొకనాఁడు దేవతార్చన కుసుమములఁ గోయుటకు మందాకినీనదికిఁబోయెను. అందు బద్మములు గోయుచున్న యమ్మునిపుంగవునిం జూచినంత పద్మసన్నిహితయైన లక్ష్మీకిఁ జిత్తచాంచల్యమైనది.

ఆలోకమాత్రంబుననే సురతసమాగమసుఖం బనుభవించిన యమ్మహాదేవికిఁ బీఠంబుగానున్న యప్పద్మంబు నంద కుమారుండుదయించెను.

ఆశిశువును గ్రహించి యాలక్ష్మి దేవ? యీతండు నీకుమారుండు గైకొనుమని పలుకుచు వాని నాశ్వేతకేతున కిచ్చినది. అమ్మునియు బాలజనోచితకృత్యము లన్నియు వానికి నిర్వర్తించి యతుండు పుండరీకమునం బుట్టుటచేఁ బుండరీకుఁ డని నామకరణముచేసి యతనికి సమస్తవిద్యలును నేర్పెను. ఆశ్వేత కేతునూనుండే యీతండు. మఱియు నీసుగుమగుచ్ఛము క్షీరసముద్రజాతమగు పారుజాతతరువునం బుట్టినది. పత్రవిరుద్ధముగా నీపూవీతని శ్రవణసంగత మెట్లయ్యె నదియుం జెప్పెద నాకణి౯ంపుము. ఈదివసము చతుర్దసియని యీతండును నేనును దేవలోకమునుండి కైలాస గతుఁడగు శితికంఠు నారాధించుటకై నందనవనము మీదుగా బోవుచుంటిమి.

అప్పుడా నందనవనలక్ష్మి యీపారిజాతమంజరిని హస్తమున ధరించి వచ్చి యీతనికి మ్రొక్కుచు నిట్లనియె. ఆర్యా! త్రిభువన దర్శనాభిరామమగు నీరూపమున కిది యనురూపమైనది. దీని శ్రవణా