పుట:Kashi-Majili-Kathalu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరణతుల్యమగు పుండరీకుని విరహవేదన జూచి కపింజలుఁ డమ్మహాశ్వేతయొద్దకుఁబోయి తెలియఁజేసెను. ఆరాత్రియే తరళిక యను పరిచారికను వెంటఁబెట్టుకొని మహాశ్వేత పుండరీకునొద్దకు వచ్చినది. ఈలోపుగనే చంద్రోదయమైనంతఁ బుండరీఁకుడు విరహబాధఁ బడలేక నీవుకూడఁ బుడమిం జనించి నావలెనే విరహతాపంబున మృతినొందుమని చంద్రుని శపించెను. చంద్రుఁ డతని నట్లే మరల శపించెను. మహాశ్వేతయు మృతుఁడైయున్న పుండరీకుని జూచి శోకించుచు నాకాశవాణిచే నూరడింపఁబడి యోగినియై యా సరస్త్సీరమందే తపంబుఁజేయుచుండెను.

పుండరీకునిచే శపింపఁబడిన చంద్రుఁడు తారాపీడుని కుమారుండై యుదయించి చంద్రాపీడుఁడనుపేరుతో పుండరీకావతారమైన వైశంపాయనుఁ డను మంత్రి పుత్రునితో గూడికొని దిగ్విజయయాత్ర జేయుచు నొక యరణ్యమధ్యంబున సేనల నిలిపి కిన్నెర మిధున మూలముగఁ జంద్రాపీఁడు డా యచ్ఛోదసరస్సునకుఁ బోయి మహాశ్వేతం గాంచి తన కథచెప్పి యామె వృత్తాంతమును విని యోదార్చును. మఱియు మహాశ్వేత సఖురాలు కాదంబరి యనుచిన్నది సఖురాలిమూలమునఁ దాను వివాహమాడనని శపథము జేయుటయు దానితండ్రి మందలింపుమని మహాశ్వేతకు వర్తమానమును బంపెను.

అప్పుడు మహాశ్వేత కాదంబరిని బెండ్లియాడుమని మందలించుటకుఁబోవుచు ఒకనాఁడు చంద్రాపీడునిగూడ వెంటఁబెట్టికొని పోయినది. కాదంబరి చంద్రాపీడునిఁజూచి మోహపరవశయై శపథములు మరచి శృంగారలీలలు ప్రకటించినది. సందిగ్ధంబగు తద్భావముల గ్రహింపక యొకనాఁడు మాత్రమేయుండి చంద్రాపీడుఁడు తనసేనానివేశమున కరిగెను. అమ్మరునాడు క్రమ్మర నతని తీసికొనిరమ్మని కాదంబరి