పుట:Kashi-Majili-Kathalu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6]

కిన్నెరమిధునముకథ

41

విగతమర్త్యసంపాతముగల యీప్రదేశమునందు నిట్టి గీతధ్వని పుట్టుటకుఁ గారణమెద్దియో? యని శంకించుచు నక్కమలినీపత్రసంస్త రణమునుండి లేచి యతండు ఆగీతానాదము లేతెంచిన దిశకు దృష్టి ప్రసరింపఁజేసెను. ఆప్రదేశ మతిదూరముగా నుండుటచేఁ బ్రయత్నముచేతఁ జూచినను నేమియుఁ గనంబడినదికాదు. అనవతరమాగాన స్వానము మాత్రము వినంబడుచున్నది. అప్పుడా గీతకారణమరయుటకు మిక్కిలి కౌతుకమందుచు నారాజకుమారుఁడు ఇంద్రాయుధము నెక్కి గీతప్రియత్వమున ముందుగా బయలువెడలిన వనహరిణములు మార్గమునుజూపుచుండ నేలా లనంగ లవలీలతాలోల కుసుమ వాసితములకు సప్తచ్ఛద తరువులచే మనోహరమైన తత్తటాక పశ్చమతీరము ననుసరించి యఱిగెను.

అట్లు పోవంబోవఁ దదుత్తరతీరంబున మనోజ్ఞతరులతావేష్టితమైన సిద్ధాయతనమొండు అతనికి నేత్రపర్వము గావించినది. స్ఫటిక శిలావినిర్మతమగు నమ్మంటపమధ్యభాగంబున మందాకినీ పుండరీకములచే నర్చింపఁబడిన స్ఫటికలింగ మొండు విరాజిల్లుచున్నది.

అమ్మహాలింగమునకు దక్షిణభాగంబున బ్రహ్మాసనము వైచుకొని హంస శంఖ ముక్తాఫల గజదంత పాదరసాది ధవళవస్తు జాతమును గరగించి యమృతరసముతోఁ బదునువెట్టి చంద్రకరకూర్చలచే సవరించి పోసెనోయనఁ దెల్లనిమేనికాంతి దీపింప బాలార్కప్రభాసదృశములగు జటామాలిక లుత్తమాంగమున ముడివైచికొని నక్షత్ర క్షోదముంబోని భస్మము లలాటమున మెఱయ నమలకీఫలస్థూలములగు ముక్తాఫలములచేఁ గట్టబడిన యక్షసూత్రము గంఠమునం గట్టికొని కుచమధ్యంబునం బిగియంగట్టిన కల్పతరులతావల్కలోత్తరీయము ఏకహంసమిధున సనాధ యగు శ్వేతగంగం బురడింప స్వభావముచేఁ దెల్లనిదైనను బ్రహ్మాసనమందుత్తానముగానిడిన చరణకాంతి