పుట:Kashi-Majili-Kathalu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5]

తారాపీడుని కథ

33

శించు తూర్పుదిక్కువలె మెఱయుచు రాజకులసంవాసప్రగల్భయయ్యు వినయమును విడువక రాహుగ్రాసభయంబునఁ జంద్రకిరణములవిడిచి పుడమికవతరించిన జ్యోత్స్నయోయన లావణ్యయుక్తమగు తెల్లని దేహకాంతి గలిగి సర్వాంగసుందరియు సకలాభరణభూషితయునై తొలిప్రాయంబున నొప్పుచున్న యా యొప్పులకుప్పంజూచి రాజపుత్రండు వెరగుపాటుతో నీవెవ్వండ వీబాలిక నేమిటికిఁ దీసికొనివచ్చితివని యడిగినఁ గైలాసుండు వినయముతో నమస్కరించుచు నిట్లనియె.

కుమారా! విలాసవతీ మహాదేవిగారు తమ కిట్లాజ్ఞాపించుచున్నారు. ఈ చిన్నది కులూ తేశ్వరుని కూఁతురు. దీనిపేరు పత్రలేఖ. మీ తండ్రిగారు దిగ్విజయము సేయుచుఁ గులూతరాజధానిం జయించి వందిజనముతోఁగూడ నీచేడియం దీసికొనివచ్చి యంతఃపురపరిచారికామధ్యంబున నుంచిరి.

నేనీ బాలికామణి వృత్తాంతము విని యనాధ యని జాలి గలిగి రాజపుత్రికయని గౌరవించుచుఁ బుత్రికానిర్విశేషముగా లాలించుచు నింత దనుకఁ బెనిచితిని. ఇప్పు డిప్పడఁతి నీకుఁ దాంబూల కరండవాహినిగా నుండునని యాలోచించి యమ్మించుబోఁడి నీకడ కనిపితిని. నీవీ పూవుఁబోడిం బరిజనసామాన్య దృష్టిం జూడఁగూడదు. బాలికనువలె లాలింపవలయును. చిత్తవృత్తివలెఁ జపలక్రియల వలన మరలింపవలయును. శిష్యురాలిగాఁ జూడఁదగును. మిత్రుఁడువోలె విస్రంభకార్యములకు నియోగింపవలయును. పెనిచినమోహంబునం జేసి కన్నబిడ్డలయందువలె నాకు దీనియం దెక్కుడు మోహము గలిగియున్నది. మహారాజ కులప్రసూత కావున గౌరవింపనర్హురాలు. కొలఁది దినములలో దీని సుగుణసంపత్తి నీకేతెలియఁగలదు. దీనిశీలమెఱుఁగవు కావున నింతగాఁ జెప్పుచుంటిని.

అని చెప్పి కైలాసుఁ డూరకున్నంతఁ దనకు నమస్కరించు