పుట:Kashi-Majili-Kathalu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తారాపీడుని కథ

31

తరువాత సుతనిర్విశేషుం డగు వైశంపాయనునిం గూడ గాఢాలింగనము గావించి ముహుత౯కాలము వారిం బరీక్షించి చూచుచు వత్సా! మీతల్లి నిన్నుఁ జూచుటకై పరితపించుచున్నది. సత్వర మామెయొద్ద కరుగుమని నియమించుటయుఁ దండ్రికి నమస్కరించి వైశంపాయనునితోఁ గూడ విలాసవతీదేవి యంతఃపురమున కరిగి యామెకు నమస్కరించెను.

ఆమెయుఁ తొందరగా చేచి పరిజనమున్నను తానే యవతరణ మంగళకృత్యముల నిర్వర్తించి తదభివృద్ధి నభిలషించుచు శిరసు మూర్కొని గాఢాలింగనము గావింపుచు నానందబాష్పములచే నతని శిరంబు దడిపినది. తరువాత వైశంపాయనునిఁ గూడ నాదరించి కరతలంబునఁ గుమారకుని శిరంబు దువ్వుచు వత్సా! నీతండ్రి కడు గఠినుఁడు సుమీ? నిన్నింతకాలము నాకుఁ గనఁబడకుండ దూరముగా నునిచి కష్టపరచెనే? కఠినమగు తండ్రిగారి యాజ్ఞ నీవెట్లు కావించితో తెలియదు. నీవు పిల్లవాఁడవైనను నీ హృదయము శిశుజన క్రీడాకౌతుకలాఘవముగాదు. ఎట్లయినను గురుప్రసాదంబున సమస్త విద్యాయుక్తుండవై చూడఁబడితివి. ఇఁక ననురూపవధూ యుక్తుండవగు నట్లు చూడఁగోరుచుంటినని పలుకుచు లజ్జాస్మితావనత ముఖుండై యున్న పుత్రుని చెక్కులు ముద్దుపెట్టుకొన్నది.

చంద్రాపీడుం డట్లు కొంతసేపందుండి తల్లి యానతి బూని వైశంపాయనునితోఁగూడ నటనుండి శుకనాసుని భవనమున కరిగి యందనేక నరపతి సహస్రమధ్యవతి౯ యగు శుకనాసునికి వినయముతో దూరమునుండియే యవనతమౌళియై నమస్కారము గావించెను.

అమ్మంత్రి సత్తముం డతని లేవనెత్తి యానందబాష్పపూరిత నయనుండై వైశంపాయనునితోఁ గూడ గాఢాలింగనము గాచించెను. రాజపుత్రుండును, మంత్రి పుత్రుండును సముచితాసనోప