పుట:Kashi-Majili-Kathalu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తారాపీడుని కథ

27

చెను. లక్ష్మీతోగూడ వక్షస్థ్సలము విస్తరించెను. ఇట్లు వారు సమారూఢయౌవనులునుఁ సమాప్తసకలవిద్యగులు నగుచుండ వారివార్తవిని తారాపీడుఁడు మిగులసంతసించుచు బలాహకుః డను సేనాపతిఁబిలిచి శుభముహూర్తమున వారిం దోడ్కొని రమ్మని యాజ్ఞాపించెను.

అతండును విద్యాగృహమునకుఁ బోయి వైశంపాయనునితో విద్యాభ్యాసము చేయుచున్న చంద్రాపీడునిం గాంచి నమస్కరించి తదానతి నుపవిష్టుండై యిట్లనియెను.

భర్తృదారక! నీవు సకలవిద్యలయందును బ్రౌఢుడవైనట్లు విని తారాపీడుఁ డెంతేని సంతసించి చంద్రదర్శనమునకు సముద్రుండు వలె నిన్నుఁ జూచుటకుఁ గోరుచున్నవాఁడు. మీరు విద్యాభ్యాసమునకుఁ బ్రారంభించి పది సంవత్సరములయినది. ఆరవయేటఁ బ్రారంభించుటచే నేటికిఁ బదియారేఁడుల ప్రాయముగలిగియుంటిరి. మీ తల్లులు మిమ్ముఁ జూచుటకు మిగుల వేడుకపడుచున్నారు. యౌవన సుఖముతోఁగూడ రాజ్యభోగ మనుభవింపుము. రాజలోకమును సన్మానింపుము. బ్రాహ్మణులఁ బూజింపుము. ప్రజలఁ బరిపాలింపుము. ఇంద్రాయుధమను తురగరత్నమిదిగో యధిష్టించిరమ్ము. మీతండ్రి గారికి దీనిఁ బారశీకదేశపురాజు సముద్రములోఁ బుట్టినదనియు నతి వేగము గలదనియుఁ గానుకగాఁబంపెను. దీనిం జూచి పరీక్షించిన వారు ఉచ్చైశ్రవమునకుఁగల చిహ్నములున్నవని చెప్పుచున్నారు. చూడుఁడని పలుకగావిని యా రాజకుమారుఁడు వైశంపాయనునితోఁ గూడ నా యశ్వలక్షణములన్నియుం బరీక్షించి వెరగందుచు నది యమానుషమని చెప్పుచు దానికి ముమ్మారువలగొని యాగుఱ్ఱ మెక్కెను.

అప్పు డత్తత్తడి సంతసించు దానివలె తోక నాడించుచు సకిలించినది. అదియే శుభశకునముగాఁ దలంచి విద్యాగృహము