పుట:Kashi-Majili-Kathalu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

కాదంబరి

మించుక ఱెక్కలు విదళించుచుఁ గొంచెము కొంచెమెగిరి కృతాంత ముఖకుహరమునుండి వెల్వడినట్లు నాతిదూరములో నున్న యొకతమాల విటసింగాంచిదట్టమైన యాచెట్టు మొదలుచేరి పక్షసవణన్‌ములగు పణ౯ములసందున డాగియుంటిని.

అక్కిరాతుఁడు గ్రమముగా నా చెట్టునంగల పిట్ట్లనెల్లఁబట్టి చెట్టుదిగి యసువులూడి క్రిందఁబడియున్న చిలుక సిసువులను జిక్కములోఁ బెట్టుకొని మాతంగుఁడఱిగిన తెరవుబట్టి యతివేగముగాఁ బోయెను.

తరువాత నేనించుక తలయెత్తిచూచుచు నాకుకదలినను వాఁడే వచ్చుచున్నవాఁడని బెదరుచు పితృమరణశోక ఖిన్నుఁడనై మిగుల దాహమగుచుండు నీరుండతావరయుచు నామూలమునుండి యెగర దొడంగితిని. ఱెక్కలతోనెగరలేక పాదములతో నడచుచు ననభ్యాసంబునం జేసి యడుగడుగునకు నేలఁబడుచు నెగరబోయి యడ్డముగా బడి యొంటిఱెక్కతో నానుచు నొగర్పుచు మేనెల్లధూళిగాఁగఁ నిట్లాయాసముతోఁ గొంచెముదూరమైనను నడువలేక మిక్కిలి దాహము వేధింప మనంబున నిట్లుతలంచితిని.

ఆహా? అతికష్టములైన యవస్థలయందుగూడఁ బ్రాణులకు జీవితమందు నిరపేక్షిత్వము గలుగదు కదా? జంతువులకు జీవితముకన్న నభిమతమైన వస్తువు వేరొండులేదు. నాయందు మిగులనను రాగముగల తండ్రి పరలోకగతుండైనను నాకు జీవితాశ వదలకున్నది. కటకటా! నాహృదయమెంత కఠినమైనదో? అతండు నాతల్లిపోయినది మొదలు సకల క్లేశములుపడి నన్నుఁబెనిచెనే? అట్టివాని ప్రేముడియంతయు గడియలో మరచిపోయితిని. నా ప్రాణము లెంత కృపణములో? ఉపకారము జేసిన తండ్రి ననుగమించినవికావు. ఇట్టి సమయములో సైతమునన్ను జలాభిలాష బాధింపుచున్నయది, పితృమరణమును