పుట:Kashi-Majili-Kathalu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిలుక కథ

13

సమయమైనది, కటకటా, అక్కటికములేని వారికిఁజేయరాని కృత్యము లుండునా? అనేకతాళోఛ్రాయముగల యాపాదపమును సోపానములు గలదానివలె సులభముగానెక్కి యెగిరీయెగరని పిల్లలను, ఎగరనున్న నిసువులను, గొన్నిదినములక్రిందటఁ బుట్టినపిట్టలను, రెక్కలువచ్చుచున్న కానలును శాల్మలీకుసుమ శంకాజనకములగు పోతముల నరసి యరసి శాఖాసందులనుండియు, గోటరములనుండియు, వేరు వేరు ఫలములను వలె పెక్కురకముల శుకశాబకముల గ్రహించి ప్రాణములను పోగొట్టి నేలం బడవైచుచుండెను.

అప్పుడు మాతండ్రియు నకాండమునఁ దటస్తించిన యప్రతీకారము ప్రాణహరము నగు నుపద్రవమునుజూచి మరణభయంబున మేను గంపమునొంద నుద్భ్రాంతదృష్టులతో నలుమూలలు సూచుచుఁ దాలువులెండ నన్నురక్షించు నుపాయంబుగానక తన రెక్కలసందున నిముడ్చుకొని గత౯వ్యతామూఢుఁడై ముక్కుగరచుకొనియుండెను.

పిమ్మట నప్పాపాత్ముఁడు క్రమమ్మునఁ గొమ్మలపై కెక్కి మే మున్న తొర్రలో యమదండమునుంబోలు తన బాహుదండమును జొనిపి సారెకు ముక్కుకొనచేఁ గరచుచు నరచుచున్న మాతండ్రిని గట్టిగఁ బట్టి పైకిఁదీసి గొంతువునులిమి ప్రాణములుబోఁగెట్టెను.

మిగుల నల్ప దేహము గలిగి భయముచేఁ దండ్రిరెక్కలసందున నడఁగియున్ననన్నువాఁడాయుశ్శేషముగలుగఁబట్టి బరిశీలింపడయ్యెను.

ప్రాణములువిడచి తలవ్రాలవైచిన నా తండ్రిని యా నిర్దయుండు అధోముఖముగా నేలంబడవిడచెను. నేనును మాతండ్రితోఁ గూడ నేలంబడితినికాని దైవవశంబున జేసి రాశిగానున్న యాకులపై బడుటచే నా కింతయేని యాయాసము గలిగినదికాదు.

అక్కిరాతుండు చెట్టుదిగకమున్న నేను బాలుండ నగుట దండ్రి చావుగణింపక ప్రాణపరిత్యాగ యోగ్యమగు కాలంబున సైత