పుట:Kashi-Majili-Kathalu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిలుక కథ

11

సమీపమునందున్న తండ్రియొక్క జరాశిధిలములగు రెక్కలసందున దూరితిని.

అప్పుడా యరణ్యమంతయుఁ బారుచున్న గ్రూరసత్వముల యార్పులచే నల్లకల్లోలమైనది. మఱికొంతసేపునకా రొదయంతయు నణఁగి యయ్యడవి కల్లోలశూన్యమగు సాగరములాగున నిశ్చబ్దమై యొప్పినది.

అట్టిసమయమున నేను శైశవచాపలంబునం జేసి యదియేమియో యని మాతండ్రి రెక్కలసందునుండి బైటికివచ్చి కంఠముచాచి భీతిచే గదలుచున్న తారకలతో యారొదవచ్చినదెసకే దృష్టిబరికించితిని.

అప్పుడావంకనుండి కార్తవీర్యార్జున భయంబున బారి వచ్చు చున్న నర్మదానైది పగిది జంఝామారుతవికీర్ణమగు తమాలకాననము పడువున నేకీభూతమగు కాళరాత్రిసంఘూతముభాతి సూర్యకిరణాకులమైన యంధకారము తీరున నయ్యరణ్యమంతయుఁజీకటిఁగలుగఁ జేయుచు ననేకసంఖ్యాకమగు శరభసైన్యము నా కభిముఖముగా వచ్చుచుండఁ జూచితిని.

ఆ సైన్యమధ్యంబున నుక్కుచే రచియింపబడినవో యనునట్లు కర్కశములగు నవయవములు గలిగి శ్యామలదేహ ప్రభాప్రవాహంబున నయ్యడవి యంతయు నిండింపుచు నెఱ్ఱని దృష్టులు వింధ్యశిలాతల విశాలంబగు నురంబును మెఱయ స్ధూలవరాటికా మాలికలచే నలంకరింపంబడి పతులం జంపవలదని తన్నుఁ బ్రతిమాలికొనవచ్చిన యాఁడు సింగంబులో యనఁ గౌలేయకటుంబినులననుసరించి రాఁ జమరీ వాలంబులు గజదంతంబులు కరిగండముక్తాఫలంబులు మయూర పింఛంబులు పిసితాహిరంబులు గైకొని శబరపరిజనులు వెంట నడువఁగృతాంతుని యంశావతారమన మహామోహిని సోదరునివలె వొప్పుచుఁ బ్రధమవయసుననున్న మాతంగుడను పుళిందనాధుం