పుట:Kashi-Majili-Kathalu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

కాదంబరి

యక్కులోఁ జిక్కి మిక్కిలిసంతోషముతో నుంటిని. అట్టిసమయమున నవ్వనమందు నాకస్మికముగా గుహాసుప్తంబులగు మృగేంద్రంబులు దద్దరిల్ల వనచరంబులుపరవ వరాహంబులార్వ శార్దూలాది క్రూర మృగసమూహంబు వెరవునంబార గంగాప్రవాహంబు ననుకరించుచు.

సీ. ఇటు రండు గజములిచ్చటనుండు తుండవి
       ధ్వస్తపంకేజ గంధంబు వెడలె
    నిందుఁ దప్పక వసియించుఁ గ్రోడములవి
       నమలుముస్తల వాసనలు గడంగె
    వనమహిషంబులవ్వలనుండు, ఱేఁగెగొ
       మ్ములఁ జిమ్ము వల్మీకముల రజంబు
    కరికలభంబు లక్కడఁ గూడు, సల్లకీ
       రసకషాయామోదమెసఁగ నెసఁగె.

గీ. రుధిరపాటల కరికుంభ రుచిన మౌక్తి
   కాంచితాంభీపదంబు లిందులరు సింహ
   గణములవె చూడుఁడభినవఘాసకభళ
   హరిణరోమంధ సేనసంహతులుదోచె.

చ. ఇదె చమరీమృగాళి వసియించెడు తావిట నాభివాసనల్
    బొదలెడుఁ బారుచున్న వవె మూకలుగా మొకముల్ సమంబుగా
    వదలుఁడు వేటకుక్కలను భద్రమువింట శరంబుగూర్చుఁడ
    ల్లదె మెక మేదియోచనె రయంబునఁ గొట్టుఁడు పట్టుడుద్ధతిన్.

అని యుండొరులతోఁ బలుకుచున్న వేటకాండ్ర ఘోష మొండు వినంబడినది.

అశ్రుతపూర్వమగు నారోద విని నేను బాలుండనగుట చెవులు బీటలువార భయముచేత మేను గడగడవడంక వివశత్వమునొంది