పుట:Kashi-Majili-Kathalu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కపింజలునికథ

159

అయ్యో! నేనిప్పుడు గొప్ప యాపదలోఁ బడిపోయితిని. శిరస్సుచే నమస్కరించి నా యవస్థయంతయు నీమె కెఱింగించి వదలుమని బ్రతిమాలుకొందునా? సరిసరి నేను లెస్సగా మాటాడుదుననియేకాదా? యీ పైదలి నన్నుఁ బట్టించినది. కావున నట్లు బ్రతిమాలు కొనుట వలన లాభములేదు. నా బంధనపీడ యీమె నేమి బాధించును? తనయుండననియా! సోదరుండ ననియా? బందువుఁడ ననియా? కావున మౌనమే యవలంభించుట యుక్తము. దానఁ గోపించి యింతకంటెఁ గష్టదశ నొందించునేమో! అవును. సందియమేలా! దీనిజాతి క్రూరజాతికాదా? ఇంతకన్నఁ గష్టమగుంగాక! యీ చండాలులతోఁ గలసి మాట్లాడుట అనుచితము. కావున మౌనమవలంభించుటయే శ్రేయము. ఇఁక మాట్లాడదు. ఈ మూకశుకంబు నాకేల యని యెప్పుడైన విసుగుజెంది విడువవచ్చును. మాట్లాడుచున్న విడువనేరదు.

ఆహా! దివ్యలోక భ్రంశము మర్త్యలోక జన్మము తిర్యగ్యోని పతనము, ఛండాల హస్తోపగమనము, పంజరబంధదుఃఖము. ఇది యంతయు నింద్రియచాపల్య దోషంబునంగదా! కలిగినది. అక్కటా! ఒక్క వాక్కునేకాదు. సర్వేంద్రియములను నియమించెద నని తలంచుచు మౌనము వహించితిని.

పలికించినను, తర్జించినను, గొట్టినను, బలవంతముగాఁ బొడిచినను నేమియు మాటాడక కేవలము సీత్కారము మాత్రము జేయుచుంటిని.

పానాశనములం దెచ్చిపెట్టినను నేమియు ముట్టక యా దివస ముపవాసమే కావించితి. ఆ మఱునాఁడును నే నేమియుం దినకున్నంతఁ జింతించుచు నా కాంతామణి స్వయముగా నానావిధములగు ఫలంబులు సురభిశీతలమగు జలంబును దీసికొనివచ్చి నాకిచ్చినది. నే నుపయో