పుట:Kashi-Majili-Kathalu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

కాదంబరి

మహాత్మా! నేను జాతిచే ఛండాలుండను గౄరకర్ముఁడను విలాసమునకు మాంసమునకు నిన్ను నేను గట్టలేదు. ఇక్కడి కనతి దూరములోనున్న మాలపల్లెయందు నా యధికారి గలఁడు. అతని కూఁతురు తొల్లిప్రాయంబున నొప్పుచున్నది. ఆమెకు జాబాలి యను మహర్షి యాశ్రమమున మాటలునేర్చిన చిలుక గలిగియున్నదని నీ వృత్తాంత మెవ్వరో చెప్పియున్నారు.

ఆ కథవిని యా చిన్నది మిక్కిలి వేడుకపడుచు నిన్నుఁబట్టి తీసికొనివచ్చుటకై బహుదినములక్రితమే నావంటివాండ్రఁ బెక్కండ్ర నియమించి యున్నది. నా పుణ్యమువలన నీవిప్పుడు నాచేఁ బట్టుపడితివి. నిన్నామెచెంతకుఁ దీసికొని పోయెదను. నీ బంధమోక్షములకా పద్మగంధియే సమర్ధురాలని పలికిన విని నెత్తిపైఁ బిడుగుపడినట్లు అంతరాత్మ బాధపడుచుండ నే నాత్మగతంబున నిట్లు తలంచితిని.

అక్కటా! మందభాగ్యుండనగు నాయొక్క కర్మనిపాకము కడు దారుణమైనదిగదా! సకలసురాసుర మకుటమణి కిరణ నీరాజిత చరణ కమలయగు మహాలక్ష్మికిఁ బట్టినై పుట్టి జగత్త్రయపూజ్యుండగు శ్వేతకేతు మహామునిచేఁ బెంపఁబడి దివ్యలోకాశ్రమముల వసియించెడు నేనిప్పుడు మ్లేచ్ఛజాతికైనఁ బ్రవేశింపఁదగని మాలపల్లె కరుగ వలసినదా? ఛండాలులతోఁ గూడఁ గలసియుండవలసినదా? మా లెతలచే నీయఁబడిన కబళములఁచే దేహము బోషించుకొనవలసినదా? ఛండాల బాలకులకు నాటవస్తువును గావలసినదా? ఆహా! దురాత్మా! పుండరీకహతక! సీ! నీ జన్మ కడు నింద్యమైనదిరా! నీవు ప్రధమగర్భమందే వేయిముక్కలై చెడిపోయితివేని యీ యిక్కట్లు రాకపోవునుగదా? తల్లీ! లోకమాతా! పద్మశరణా! అశరణ జనశరణ చరణపంకజా! నన్నీ నరకూపమునం బడకుండఁ గాపాడ