పుట:Kashi-Majili-Kathalu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కపింజలునికథ

151

ఇంతలో హరీతకుఁడువచ్చి అన్నా! వైశంపాయన! నీపుణ్యము మంచిది. నీతండ్రియొద్దనుండి నిన్ను వెదకిఁకొనుచుఁ గపింజలు డిచ్చటి కిప్పుడు వచ్చెనని చెప్పుటయు నే నప్పుడు రెక్కలువచ్చిన దానివలె నెగరబోయి యత్యంతసంతోషముతో నతం డెక్కడ నని యడిగితిని.

అప్పుడు హరీతకుఁడు అతండు మాతండ్రియొద్దనుండి మాటలాడుచున్నవాఁ డని చెప్పిన విని నేను ఆర్యా! అతనిం జూచుటకు నాహృదయము మిక్కిలి పరితపించుచున్నది. నన్ను వేగమ వాని చెంతకుఁ దీసుకొని వెళ్ళుమని ప్రార్ధించుచుండఁగనే యాకపింజలుఁడు గగనమార్గమునఁ బూర్వరూపముతో నాయొద్దకు వచ్చెను.

వానింజూచి నేను గన్నీరుగార్చుచు నట్లుండియు నెదురుకొనఁ బ్రయత్నించితినికాని రెక్కలు రామింజేసి శరీరము కదలినదికాదు. అప్పుడు నేను దీనస్వరముతో వయస్యా! కపింజల జన్మద్వయాంతరిత దర్శనుండవగు నీరాక చూచి తొందరగా లేచి యెదురుకొనుచుఁ జేతులుచాచి గాఢముగా నాలింగనము జేసికొనుటకును జేయిపట్టుకొని పీఠంబునఁ గూర్చుండఁబెట్టుకొనుటకు సుఖాసీనుండవైన నీకు గమనాయాసంబు వాయనడుగు లొత్తుటకును నాకు యోగ్యత లేకపోయినది కదా యని చింతించుచున్న నన్నుఁ గపింజలుఁడు తన రెండుచేతుల తోడ నెత్తిపట్టుకొని యాలింగన సుఖం బనుభవించువాఁడుఁబోలె వక్షమున నిడుకొనుచు శోకంబున మదీయచరణంబుల శిరంబున నుంచుకొనుచుఁ బ్రాకృతుండువోలె బెద్దయెలుంగున రోదనము జేసెను.

అట్లు పెద్దయెలుంగునఁ బాకృతుండువోలె శోకించుచున్న యతని నూరడించుచు నే నిట్లంటిని. సఖా! కపింజల సకలక్లేశపరిభూతుండనగు నాకీ శోకము తగునుగాని నీవిట్లు విలపించెదవేమిటికి? నీవు బాలుండవైనను సంసారబంధాత్మకములగు రాగాదిదోషముల నంటక