పుట:Kashi-Majili-Kathalu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైశంపాయనుని కథ

141

గీ. విప్రకాంతుల కిమ్ము నావీణ నీవు
    పుచ్చుకొని పాడుకొనుచుండు మిచ్చవచ్చి
    నట్లు చేయుము తక్కిన యన్ని వస్తు
    వులును నాకుఁ బ్రియంబుగాఁ జెలియ నీవు.

చ. రమణి! మదీయపాదతల రంజితమైన యశోకభూజపో
    తము జిగురించె నిప్పుడది తత్కిసలంబుల నేరుకణ౯పూ
    రమునకు నైన ముట్టుకొనరాదు సుమీ! మఱిమాలతీలతా
    సునముల దేవతార్చనకేసూ! లవనం బొనరింపఁగాఁదగున్.

క. ఆ వనిమానుషి తాపసిఁ
    బో విడువుము కానకేను బోషించెడు నా
    జీవం జీవక మిధుము
    గావంగాఁదగును కేలికా శైలమునన్.

మఱియు నాపాదసహచారి యగు హంసకమున కొకరివలన నపాయములేకుండ రక్షించుచుండుము. ప్రాణసఖీ! నీవేనాకుఁబుత్రుండవై పరలోకగతనగు నాకుఁ జలాంజలు లొసంగుచుండుము. నేనీ చంద్రాపీడుని కంఠమును గౌఁగలించుకొని ప్రాణంబుల విడుచుదాన నని పలుకుచు నాప్రాంతమందు నిశ్చేష్టితయైపడియున్న మహాశ్వేతను గౌఁగలించుకొని మఱియు నిట్లనియె;

ప్రియసఖీ! నీవు ప్రియుండు వెండియు వచ్చునని మరణము కన్న నెక్కుడగు నిడుములంబడుచుఁ బ్రాణములఁదాల్చి యాసతో నుంటివి. నాకట్టియాససైత ముంచుకొన నవసరములేదుకదా! కావున నాకు మరణమునకు ననుజ్ఞ యిమ్ము. జన్మాంతరమందైన నీస్నేహము గలుగునట్లు కోరుచున్నదాన నాతప్పుల మన్నింపుమని పలుకుచు లేచి వనకుసుమ కిసలయములచే నతనిపాదము లర్చించి హస్తములచే నెత్తి తొడయం దిడుకొని కూర్చుండెను.