పుట:Kashi-Majili-Kathalu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

కాదంబరి

ఇందుముఖీ! కందర్పునితోఁగూడి నన్నిప్పు డీచందురుఁడు చంపుటకుఁ బ్రయత్నించుచున్నవాఁడు కావున నిన్ను శరణు జొచ్చితిని. అనాథునాతు౯ నవ్రతీకారాక్షు భవదాయత్తు నన్ను రక్షింపుము, శరణాగత పరిత్రాణము తపస్వీజన ధమ౯మేకదా. నీవిప్పుడు నన్నాత్మ ప్రదానంబున రక్షింపవేని తప్పక నీకు బ్రహ్మహత్యాపాతకము గాఁ గలదని పలికెను.

వానిమాటలువిని నేను రోషానలంబున భస్మము చేయుదానివలె బాష్పస్ఫులింగదృష్టిచే వానింజూచుచు నావేశించిన దానివలె నొడలెఱుంగక కోపవేగ రూక్షాక్షరముగా హుమ్మనిపలుకుచు నిట్లంటి.

ఓరిపాపాత్ముడా! నన్ను నీవిట్లన నీతల పిడుగుపడినట్లు నూఱు వ్రక్కలయినదికాదేమి? నీజింహ లాగికొనిపోలేదే? సకలలోక శుభా శుభ సాక్షీభూతములగు పంచభూతములు నీయందులేవాయేమి? వాని చేతనయిన మడియవైతివే? మూఢుఁడా! ఇట్టి కామవృత్తిగలిగిన నీవు తిర్యగ్జాతియందుబుట్టక యిట్లేల పుట్టితివి? వక్రముఖానురాగముగలిగి స్వపక్షపాతమాత్ర ప్రతృత్తితో నొప్పుచు స్థానాస్థాననిరూపణ విధం బెఱుంగక చిలుకవలె హాతవిధిచేఁ బలికింపఁబడితివి. శుకజాతియందైనఁ బుట్టకపోయితివేమి? ఆత్మవచనానుగుణమగు జాతియందుఁ బుట్టితివేని యిట్లు నన్నుఁ గామింపకపోవుదువుకదాయని పలుకుచుఁ జంద్రమండలమున దృష్టియిడి దేవా! సకలలోకచూడామణీ! లోకపాల! నేను బుండరీకునిఁ చూచినదిమొదలు యితరదృష్టిలేక యతనినే ధ్యానించు దాననైతినేని వీఁడు నామాటచే హీనజాతియందుఁ బుట్టునని పలికితిని.

అప్పుడతండు మదీయశాపముననో మదనజ్వర వేగముననో పాప విపాకముననో తెలియదుకాని నేనట్లు పలికినతోడనే నరకబడిన తరువువలెఁ జేతనముబాసి నేలంబడియెను. అతం డట్లు గతాసుండగు