పుట:Kashi-Majili-Kathalu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైశంపాయనుని కథ

133


మీరందఱు గుర్రములనుండియే లతాగహనములను తరుమూలములు లతామంటపములు మొదలగు ప్రదేశములలో విమర్శగా నరయుఁడని పలుకుచుఁ దాను మిక్కిలి శ్రద్ధాపూర్వకముగా నతని వెదకెనుకాని యెందును అతనిచిహ్నము లేమియుం గనబడినవికావు.

అప్పు డతడు పెక్కుతెరంగులఁ జింతించుచు వైశంపాయనుని వార్త మహాశ్వేతకేమైనం దెలియునేమోయనియుఁ గాదంబరీ విశేషములుగూడఁ దెలియబడుననియు నూహించి తురగసైన్యమంతయు దదీయాశ్రమమున కనతిదూరంబున నుండ నియమించి సముచితపరివారముతోఁ దానింద్రాయుధమెక్కి యామె యాశ్రమమునకుఁబోయి గుహాముఖంబున వారురవమునుడిగి సన్ననివస్త్రములుదాల్చి యక్కందరాంతరమునకుఁ బోయెను.

అందు శోకవేగంబున నవయవంబులు చలింప గన్నులనుండి ధారగా నీరుగార్చుచుఁ గాలివానతాకుడున వాడినతీగెయుంబోలె మొగమువంచి తరిళికకేలు బట్టుకొనఁబడియున్న మహిశ్వేతంజూచి యతండు విభ్రాంతుండై అయ్యో కాదంబరి కెద్దియేని యప్రియము జరిగియుండఁబోలుఁ గానిచో నిమ్మానిని యిట్లుండదు. ఏమి దైవమా యని ప్రాణంబులెగిరిపోయినట్లు సారెసారెకుఁ దొట్రుపడుచు మెల్లగాఁ దాపునకుఁబోయి బోటీ యీమె యిట్లున్న దేమి యని తరళిక నడిగిన నప్పడతియు నేమియుంజెప్పక యట్టి యవస్థలోనున్నను మహాశ్వేత మొగముజూచినది. అప్పు డాసాధ్వియే క్రమంబున శోకవేగం బడంచుకొని గద్గదస్వరముతో నన్నరవరసూతి కిట్లనియె.

మహాభాగ! సిగ్గులేని యీపాపాత్ము రాలేమిడిఁకి జెప్పకుండును? వినుండు. కేయూరక ముఖముగా భవదుజ్జయినీగమన వృత్తాంతమునువిని మనమెఱియ అయ్యో మదిరాచిత్రరధుల మనోరధమును