పుట:Kashi-Majili-Kathalu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17]

వైశంపాయనుని కథ

129


గలుగదు. తురగ యావంబునఁబోయిన నాకేమియు నాయాసము గలుగదు. గమనాభ్యనుజ్ఞ యిమ్ము. నేనుబోయి ప్రియమిత్రునిం దీసికొని వత్తును. అతండు రానిచో నేనుసైత మచ్చటనే యుండెదనని పలికిన విని శుకనాసుఁడు తారాపీడునితో దేవా! యువరాజుగ మనమునకు విజ్ఞాపనజేసికొను చున్నవాఁడు. సెలవేమియని యడిగిన నతం డిట్లనియె.

ఆర్యా! మనమొకటి దలఁచి కొనియుండ దైవము వేరొకటి తెచ్చిపెట్టెను. కానిమ్ము. వైశంపాయను నవశ్యముగా యువరాజు దీసికొనిరావలయును. అతని విడిచి యీతఁ డొక నిమిషమైనఁ తాళలేఁడు. తప్పక పోవలసినదే. యతని దీసికొనివచ్చుటకు నాయుష్మంతుని మాట జెప్పనేల. విలాసవతినైనఁ బంపెదను సుమీ యని పలికి దైవజ్ఞులరప్పించి యప్పుడే ప్రయాణమునకు ముహూర్తము నిశ్చయించి పిమ్మటఁ జంద్రాపీడునిం జూచి రాజు వత్స! నీవీ వార్త మీ తల్లికిం జెప్పి వేగపొమ్మని పలుకుచు శుకనాసునితోఁగూఁడ దన భవనమునకుఁ బోయెను.

తరువార నా రాజకుమారుఁడు తల్లియొద్దకుఁబోయి నమస్కరించుచు దాపునం గూర్చుండి మిక్కిలి విచారింపుచున్న మనోరమ కిట్లనియె. తల్లీ! నీవుల్లంబునఁ జింతిల్లకుము. వైశంపాయనుని దీసికొని వచ్చుటకు మా తండ్రి నా కానతిచ్చెను. నేనువెళ్ళి యలఁతికాలములో నాతనిం దెచ్చెదను. నీవుగూడ ననుజ్ఞయిమ్ము. పోయివచ్చెదననుటయు నామె యిట్లనియె.

వత్సా! నేను వెళ్ళెదనను మాటచే నాకు శోకోవశమనము జేసెదవేల? నాకు నతనియందుకన్న నీయందు మక్కువ మెండు. నీవు పోయిన నెవ్వరిజూచికొని ధైర్యమవలంభింతును? నీవు పోవలదు.