పుట:Kashi-Majili-Kathalu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

కాదంబరి


గులఁ దలంచుచు నతివేగముగా నచ్చోటికి బోవఁదలంచియుఁ దల్లిదండ్రుల కెఱిగింపకపోరాదని నిశ్చయించి యప్పుడే తురగమెక్కి యత్యంతరయంబునఁ దనపట్టణమునకు వచ్చెను.

ఆవీటిలోఁ బ్రజలందరు గుంపులుగాఁ గూడుకొని వైశంపాయనుని వృత్తాంతమే చెప్పుకొనువారును, వినువారును, అడుగువారును, విచారించువారునై వీథులయం దుండుటఁ జూచి చంద్రాపీడుఁడు అక్కటా! యీవాత౯ నాకన్న ముందర పట్టణములోనికి వచ్చినది. మాతండ్రిగారికిని శుకనాసునికిఁగూడఁ దెలిసియేయుండును వైశంపాయనునిగురించి బాహ్యజనంబే యింత విచారింపుచుండఁ దల్లిదండ్రుల కెట్లుండునో? నన్నేమని శంకింతురో యని పెక్కు తెరంగులఁ దలపోయుచుఁ గ్రమంబున బహిర్ద్వారము దాపునకుఁబోయి యందు గుఱ్ఱమును దిగి యాస్థానమునకుఁ బోవుచున్నంతఁ దారాపీడుఁడు విలాసవతితోఁగూడ శుకనాసునిగేహములందున్న వాఁడను వాత౯ వినంబడినది.

అప్పు డతండును మరలి తానుగూడ నచ్చటికిఁ బోవుచుండ సమీపముగా నిట్టిధ్వని వినంబడినది.

హా! వైశంపాయన? హా! వంశపావన! మదీయాంకసీమ యందు లాలింపఁబడుచుండెడి నీవిప్పుడు వ్యాళశతభీషణమయిన కాంతారములో నొంటిగా నెట్లుంటివి? అందు శరీరరక్ష నీకెట్లు జరుగుచున్నది? నీకు నిద్రాశుకమిచ్చుశయ్య నెవ్వరు గల్పించుచున్నారు? నీయాకలి గనిపెట్టి యన్న మిడువారెవ్వరు? పట్టీ! ఎట్టియవస్థవచ్చినది. అయ్యో! నీవు వచ్చినతోడనే మీతండ్రితోఁజెప్పి తగినకన్యకను వివాహము జేయవలయునని తలంచియుంటినే మందభాగ్యురాలనగు నాకట్టి యదృష్ట మెట్లు పట్టును? నన్నును మీతండ్రిని నీవున్న చోతికి దీసికొని పొమ్ము. నిన్ను విడిచి మేము నిమిషమైనఁ దాళ