పుట:Kashi-Majili-Kathalu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైశంపాయుని కథ

125


సమధు౯ఁడను కాను. కారణము నాకుఁ దెలియదు. మీరు చూచుచునే యడిగెదరేల? మీరు పొండు పొండని పలికి ముహూత౯కాల మూరకొని యందు రమ్యములైన లతాగృహములు సరస్త్సీరములు గ్రుమ్మరుచు నాదేవాయతనమున నెద్దియో మరచిపోయినట్లు నెదకుచు నితరదృష్టిలేక తిఱుగుచుండెను.

మేము పొదలమాటుననుండి ఱెండుయామములవరకు నతని చేష్టలం గనిపెట్టి తిరిగిపోయి రమ్మని నిర్బధింప నతఁ డయ్యో! నన్నిట్లు వేపెదరేల? నాకు నాజీవితముకన్నఁ జంద్రాపీడుని ప్రాణములు ప్రియములుకదా! అవి యతని విడిచి బలత్కారముగా నా యొద్దకు వచ్చినను గార్యము లేదని తోచుచున్నది. ఇంక మీరేల వేడెదరు? పొండని పలికి లేచి యందు స్నానము చేసి కందమూల ఫలము లాహారముగాఁ బుచ్చుకొని వనవాసోచితవ్యాపారమును గైకొనియెను.

అప్పుడు మేము విస్మయమందుచు మూఁడహోరాత్రములు వేచియుంటిమి కాని యతనిబుద్ధి తిరిగినదికాదు. అప్పుడు నిరాశులమై యందుఁ గొందరఁ గావలియుంచి మేము బయలుదేరి వచ్చితిమి.

అని యెఱింగించిన వారి మాటలు విని చంద్రాపీడుఁడు చింతా విస్మయము లొక్కమాటు చిత్తం బుత్తలపెట్ట నిట్లు తలంచెను.

అయ్యో! వైశంపాయనుని కింతలో వై వృత్తిబూనుటకుఁ గారణమేమియుం గనంబడదు. తారాపీడుఁ నన్నుఁబలె వానిని సైతము గారవించును. ప్రజలకు సైతము నాయందుకన్న వాని యందె మిక్కుటమగు మక్కువగలిగియున్నది. శుకనాసుఁడు మనోరమయు నతని నేవిషయములోను మందలించి యెఱుఁగరు. అతనికిఁ బ్రశాంతికైన నిది సమయముకాదు ఇదివరకు విద్యజ్జనోఁచితమైన గావా౯స్థ్యమందే ప్రవేశింపలేదు. ఇదియేమియో యని పెక్కు తెరం