పుట:Kashi-Majili-Kathalu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

కాదంబరి

పలుమారు మేము తొందరపెట్టుటయు నెట్టకేలకు మమ్ము జూడకయే నేను రాను. మీరిందుండరాదు. అతండరిగి పెద్దతడవయినది. వేగమ పొండని పలుకగా విని అయ్యో! యీతం డకారణముగా వైరాగ్యమును జెందెనే యని శంకించుకొనుచు సానునయముగా బోధించియు, నిష్ఠురముగాఁ బలికియు నీకీ మోహము తగదు. వడిగా రమ్ము. చంద్రాపీడుఁడు నిన్నువిడిచి వచ్చిన మమ్ము జండించునని యెన్నియో రీతులం జెప్పిన నెట్టకేలకు విలక్షణహాసయుక్తమగు మొగముతో మా కిట్లనియె.

ఇప్పుడు నాకేమియుం దెలియకున్నది. నన్ను మాటిమాటికి గమనమునకు మీరు బోధన చేయుచున్నారు. నేను చంద్రాపీడుని విడిచి యెప్పుడైన నుంటినా? అంతయు నాకెఱుక యగుచున్నది కాని నేనేమియుం జేయలేను. తెలిసినను జేయుటకు శక్తుఁడకాకుంటిని చూచుచున్నను నాదృష్టి మఱియొకచోటికిఁ బ్రసరింపదు. పాదములు గదలవు. ఇచ్చట స్థాపనజేయఁబడినదివోలె నాతనువు కదలకున్నది. కావున నేను వచ్చుటకు సమధు౯డను కాను నన్నొక వేళ మీరు బలాత్కారముగాఁ దీసికొనిపోయెదరేని నామేనఁ బ్రాణములు నిలుపనని తోచుచున్నది. ఇచ్చటనే యుండినచో నాహృదయంబున నెట్లో యున్నది. ప్రాణములు ధరింతునని ధైర్యమున్నది. కావున మీరు నన్ను నిర్భంధింపకుఁడు మీరువోయి యావజ్జీవము చంద్రాపీడమఖదర్శన సుఖం బనుభవింపుఁడు. నాకట్టి సుఖములేకుండ దైవము విడదీసి నని పలికిన మేమడలుచు నదికైతవనునుకొని అయ్యో! యిట్లు పలికెదరేల? చంద్రాపీడుని దావునకు రారాయని నిర్బంధముగా బెక్కుసారు లడిగిన నతం డిట్లనియె.

అక్కటా! మీరూరక నన్ను నిర్బంధించెదరేల? చంద్రాపీడుని జీవితముతోడు నా కేమియుఁ దెలియకున్నది. నేను వచ్చుటకు