పుట:Kashi-Majili-Kathalu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి కథ

115


రకుని కిట్లనియె. గంధర్వపుత్రా! కాదంబరియొక్కయు మహాశ్వేతయొక్కయు మదలేఖయొక్కయు సందేశ మేమియో యెఱుంగఁ జెప్పుమని యడిగిన నతం డిట్లనియె..

రాజపుత్ర! అచ్చటి విశేషములు వినుము? బత్రలేఖను దీసికొనివచ్చి మేఘనాధుని కప్పగించి తిరుగాఁపోయి దేవరయొక్క యుజ్జయినీ గమసవృత్తాంతము చెప్పి మీయుత్తరము చేతికిచ్చితిని. అది చదివి మహాశ్వేత తలయెత్తి యెద్దియో యాలోచించి నిట్టూర్పు నిగుడించుచు విచారముతో లేచి తపంబుజేయుటకై వెండియుం దన యాశ్రమమునకుఁ బోయినది.

కాదంబరియు నీవాత౯ విని హృదయము బాదుకొనుచు నెత్తి మోదుకొనుచు మూర్ఛ మునింగి నేలంబడి యంతలో లేచిమహాశ్వేత యఱిగిన విధమెఱుఁగక కన్నులం దెరచి శిరఁకంపముచేయుచుఁ గేయూరకా! యీసంగతి మహాశ్వేతతోఁ జెప్పుమనియు మదలేఖా! చంద్రాపీడుఁ డెట్టి పని చేసెనో చూచితివే! యిట్టివాఁ డెందేనిం గలడా యనియు సోపహాసముగాఁ బలుకుచు లేచి పరిజనుల విడిచి యొక్కతియ యేకాంతగృహమునకుఁ బోయి తల్పంబున మేను జేర్చి ముసుఁగువైచుకొని మదలేఖతో సైతము మాటాడక తత్పరితాపము లోపలనే యనుభవింపుచు నాదినము గడపినది.

అమ్మరునాఁడుదయమున నే నామె సమీపమున కేగినంత ఆహా! మీయట్టి యాప్తులు గలిగియున్నను, నేనిట్టి యుత్కృష్టకష్టములం జెందుచుంటినేయని యాక్షేపించునదియుంబోలెఁ బాష్పపూరోద్రేకముచేఁ బర్యాకుల మగు దృష్టిచే నన్నట్టెచూచినది.

ఆచూపులవలననే తదీయహృదయాభిప్రాయము గ్రహించి యామెతోఁజెప్పకయే దేవరం జూడవచ్చితిని. మీనిమిత్తమాత్త కాశిని మిక్కిలి బాధపడుచున్నది. ఆమె పడెడు నిడుములఁ జెప్పనలవి